MS Dhoni-Sandeep Reddy: యానిమల్ స్టైల్లో ధోని.. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో మహి!
ఈ వార్తాకథనం ఏంటి
ఎంఎస్ ధోని మరోసారి మైదానంలో సందడి చేయడానికి సిద్ధమవుతున్నాడు. అయితే ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభానికి ముందే ధోని తన లోపల ఉన్న 'యానిమల్'ను బయటకు తెచ్చేశాడు!
అసలు విషయం ఏమిటంటే ధోని ఇటీవలే దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో కలిసి ఓ ఫన్నీ యాడ్‌లో నటించాడు.
ఈ ప్రకటనలో ధోని రణ్‌బీర్ కపూర్‌ను అనుకరిస్తూ కనిపించడంతో పాటు, సందీప్ రెడ్డి వంగా కూడా కనిపించారు.
ఈ యాడ్ ఎలక్ట్రిక్ సైకిల్ బ్రాండ్ EMotorad కోసం రూపొందించింది. ఇందులో ధోని 'యానిమల్' సినిమా ఫేమస్ సీన్‌ను రీ క్రియేట్ చేశాడు.
Details
యాడ్ అదిరిపోయింది
రణ్‌బీర్ కపూర్ తన కారు నుంచి స్టైలిష్‌గా దిగి రోడ్డు దాటే సన్నివేశాన్ని ఈ ప్రకటనలో ధోని ఎలక్ట్రిక్ సైకిల్‌పై రీ క్రియేట్ చేశారు.
ఈ యాడ్‌లో ధోని, సందీప్ రెడ్డి వంగా మధ్య ఆసక్తికరమైన సంభాషణ కూడా ఉంది. ప్రస్తుతం ధోని తన 18వ ఐపీఎల్ సీజన్ కోసం సీఎస్క్ జట్టుతో ఉన్నాడు.
మార్చి 23న చెన్నైలో ముంబై ఇండియన్స్‌తో తొలి మ్యాచ్ ఆడనున్నారు. ధోని అభిమానులు ఈ యాడ్‌ను ఆసక్తిగా స్వీకరించగా, ఆన్-స్క్రీన్‌లో ధోని కొత్త లుక్‌కి క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.