వామ్మో ధోని.. ఆ కండలతో కొడితే సిక్సర్ల వరదే..!
టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోని నెట్స్ శ్రమిస్తున్నాడు. సీఎస్కేను ఇప్పటికే నాలుగుసార్లు ఛాంపియన్ గా నిలిపిన ధోని.. ఈ ఎడిషన్‌లో ఎలాగైనా టైటిల్ తో కెరీర్ ఘనంగా ముగించాలని తహతహలాడుతున్నాడు. ఇప్పటికీ క్రికెట్లోకి వచ్చిన కొత్త ప్లేయర్ లాగా తన ఫిట్ నెస్‌ను మెయింటేన్ చేస్తున్నాడు. ప్రస్తుతం చెన్నైలో ప్రాక్టీస్ చేస్తున్న ధోని కండల ఫోటోను చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మరో రెండు వారాల్లో ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభం కానుంది. ఇప్పటికే చెన్నైకి చేరుకున్న ధోని ప్రాక్టీస్‌లో కఠోర సాధన చేస్తున్నాడు. అతను ఏడాది కాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. దీంతో ఫినిషర్‌గా తన పాత్రను పోషించేందుకు రెడీ అవుతున్నాడు.
ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ధోని
తాజాగా భారీ కండలతో ఉన్న ధోని ఫోటోను సీఎస్కే పోస్టు చేసింది. ఈ ఫోటోను చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. 41 ఏళ్ల వయసులోనూ ఇలాంటి బాడీ మెయింటేన్ చేయడం చూసి నోరెళ్లబెడుతున్నారు. ఇప్పటికే ఈ పోస్టుకు లక్షల సంఖ్యలో లైక్స్ వచ్చాయి. గతేడాది చైన్నై ఫేలవ ప్రదర్శనతో 9వ స్థానంలో నిలిచింది. మార్చి 31న డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ తో చైన్నై తలపడనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ధోని 234 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 4978 రన్స్ చేశారు. ఇప్పటికే ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్ లు ఆడిన రికార్డు ధోని పేరిట ఉంది.