Page Loader
Digvesh Rathi: దిగ్వేశ్ స్టైల్ ఏమాత్రం తగ్గడం లేదు.. నోట్‌బుక్ తర్వాత గ్రౌండ్‌పై రాసిన స్పిన్నర్ (వీడియో) 
దిగ్వేశ్ స్టైల్ ఏమాత్రం తగ్గడం లేదు.. నోట్‌బుక్ తర్వాత గ్రౌండ్‌పై రాసిన స్పిన్నర్ (వీడియో)

Digvesh Rathi: దిగ్వేశ్ స్టైల్ ఏమాత్రం తగ్గడం లేదు.. నోట్‌బుక్ తర్వాత గ్రౌండ్‌పై రాసిన స్పిన్నర్ (వీడియో) 

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 09, 2025
10:35 am

ఈ వార్తాకథనం ఏంటి

లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ దిగ్వేశ్ రథీ మరోసారి వివాదాస్పద సంబరాలతో వార్తల్లో నిలిచాడు. మంగళవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో తన అభిమాన స్పిన్నర్ సునీల్ నరైన్‌ను ఔట్ చేసిన వెంటనే కొత్త తరహా సెలబ్రేషన్లతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈసారి మైదానంలో గడ్డి మీద తన చేతులతో ఏదో రాస్తున్నట్లుగా కనిపించాడు. 'నోట్‌బుక్ సెలబ్రేషన్‌'కు మరో రూపంగా దీన్ని చెప్పొచ్చు. ఇంతకుముందు పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రియాన్ష్ ఆర్యాను ఔట్ చేసిన తర్వాత 'నోట్‌బుక్ సెలబ్రేషన్' చేస్తూ ఆయనపై ఐపీఎల్ నిర్వహకులు జరిమానా విధించిన సంగతి తెలిసిందే.

Details

రథీపై చర్యలు తీసుకొనే అవకాశం

ఇప్పటికే ఒకసారి శిక్ష పడినప్పటికీ మరోసారి ఇదే తరహాలో వివాదాస్పద ప్రవర్తన చేయడం స్పిన్నర్‌పై విమర్శలకు దారితీస్తోంది. ఈ సీజన్‌లో రెండవసారి దిగ్వేశ్ రథీపై చర్యలు తీసుకునే అవకాశముందని, బీసీసీఐ ఈ కొత్త సంబర శైలిపై ఎలా స్పందిస్తుందో అనేది ఆసక్తికరంగా మారింది. క్రీడా నైతికతను ఉల్లంఘించేలా కనిపిస్తున్న ఈ ప్రవర్తనపై చర్యలు తీసుకోవాలని పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో