PCB: పాక్ క్రికెట్‌లో దారుణ పరిస్థితులు.. సొంత దేశానికి సేవ చేయాలన్నా భయమే!
ఈ వార్తాకథనం ఏంటి
సాధారణంగా ఏ క్రికెటర్ ఆటకు వీడ్కోలు పలికినా.. ఏదో ఒక రూపంలో తన దేశానికి సేవ చేయాలని కోరుకుంటాడు. ముఖ్యంగా కోచింగ్, మెంటారింగ్ వంటి బాధ్యతలు చేపట్టి యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేయడానికి మాజీలు ముందుంటారు. అయితే పాకిస్థాన్‌కు చెందిన మాజీ క్రికెటర్ ముస్తాక్ అహ్మద్ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించారు. సొంత దేశానికి సేవ చేయాలంటేనే భయంగా ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన రెండు టెస్టుల్లోనూ పాకిస్థాన్ జట్టు పేలవ ప్రదర్శన చేసింది. దీంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న పాక్ క్రికెట్ బోర్డు.. ఆటగాళ్లతో పాటు ఇద్దరు కోచ్‌లపై కూడా చర్యలు తీసుకుంది.
వివరాలు
ఈ తరహా నిర్ణయాలు తీసుకోవడం సరైన విధానం కాదు
అయితే సిరీస్ జరుగుతుండగానే ఈ తరహా నిర్ణయాలు తీసుకోవడం సరైన విధానం కాదని ముస్తాక్ అహ్మద్ అభిప్రాయపడ్డారు.
గతంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో పనిచేసిన ముస్తాక్.. బంగ్లాదేశ్ జట్టుకు స్పిన్ కోచ్‌గా కూడా సేవలందించారు.
'నా దేశానికి సేవ చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను. కోచింగ్ బాధ్యతలు చేపట్టడానికి కూడా వెనుకాడను.
ప్రస్తుత ఆటగాళ్లను సవాళ్లకు సిద్ధం చేసి, అంతర్జాతీయ క్రికెట్‌పై వారికి ఆత్మవిశ్వాసం పెంచి.. ప్రత్యర్థి జట్లకు గట్టి పోటీ ఇవ్వగల జట్టును తయారు చేయడానికి ఇదే సరైన సమయం. అయితే అందుకు పీసీబీ నుంచి పూర్తి మద్దతు అవసరం.
వివరాలు
స్వదేశీ కోచ్‌లను భిన్నంగా చూస్తున్నారు: మిస్బా
సర్ఫరాజ్, గుల్‌లను పదవుల నుంచి తొలగించిన సమయంలో ఓ క్రికెటర్‌గా నేను ఎంతో బాధపడ్డాను. పనిచేసిన వారికి గౌరవం ఇవ్వకుండా.. ఏదో ఒక కారణం చూపించి తొలగిస్తే, సొంత దేశం కోసం పనిచేయాలంటే భయపడాల్సి వస్తుందని ముస్తాక్ అహ్మద్ పేర్కొన్నారు.
ఇటీవలే సెలక్టర్ పదవికి రాజీనామా చేసిన పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ కూడా పీసీబీ వ్యవహారశైలిపై విమర్శలు చేశారు.
స్వదేశీ కోచ్‌లతో పోలిస్తే విదేశీ కోచ్‌ల విషయంలో బోర్డు వ్యవహరించే తీరు పూర్తిగా భిన్నంగా ఉంటుందని ఆయన అన్నారు.
ఏదైనా ఓటమి ఎదురైతే విమర్శలు ఎక్కువగా స్వదేశీ కోచ్‌లపైనే వస్తాయి. విదేశీ కోచ్‌లను నియమించుకోవద్దని నేను చెప్పడం లేదు.
వివరాలు
ఇదే పీసీబీ అసలు ప్రణాళిక: షోయబ్ అక్తర్
కానీ వారికి ఎక్కువ అధికారం ఇస్తున్నారు. స్థానిక కోచ్‌లను మాత్రం మరో విధంగా చూస్తున్నారని మిస్బా వ్యాఖ్యానించారు.
షోయబ్ అక్తర్ మాత్రం పీసీబీ నిర్ణయాలకు మద్దతుగా మాట్లాడటం గమనార్హం. ''ప్రస్తుత జట్టు నుంచి పాక్ బోర్డు ఆశించిన ఫలితాలు రాలేదు. అందుకే కొందరిని తప్పించి కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇచ్చింది.
పాకిస్థాన్ జట్టు తరఫున నిబద్ధతతో ఆడే ఆటగాళ్లకే అవకాశాలు కల్పించింది. అయితే షహీన్ షా అఫ్రిది, నసీమ్ షా, హారిస్ రవూఫ్ విషయంలో బోర్డు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి.
వారు పాక్ క్రికెట్‌కు కీలక ఆటగాళ్లు. అదే సమయంలో కొత్త తరం ఆటగాళ్ల నుంచి మరీ భారీ అంచనాలు పెట్టుకోవద్దు. వారికి కొంత సమయం ఇవ్వాలని షోయబ్ అక్తర్ సూచించారు.