Loading...
Novak Djokovic: జొకోవిచ్ కన్నీటి వీడ్కోలు.. యూఎస్ ఓపెన్ తొలి రౌండ్‌లోనే సంచలన ఓటమి!
జొకోవిచ్ కన్నీటి వీడ్కోలు.. యూఎస్ ఓపెన్ తొలి రౌండ్‌లోనే సంచలన ఓటమి!

Novak Djokovic: జొకోవిచ్ కన్నీటి వీడ్కోలు.. యూఎస్ ఓపెన్ తొలి రౌండ్‌లోనే సంచలన ఓటమి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 31, 2026
11:30 am

ఈ వార్తాకథనం ఏంటి

టెన్నిస్ ప్రపంచంలో పెను సంచలనం నమోదైంది. సెర్బియా స్టార్, టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్‌కు యూఎస్ ఓపెన్‌లో అనూహ్య పరాభవం ఎదురైంది. రికార్డు స్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలన్న లక్ష్యంతో బరిలోకి దిగిన జొకోవిచ్.. తొలి రౌండ్‌లోనే ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించాడు. అర్జెంటీనా ఆటగాడు మరియానో నవోనే చేతిలో జొకోవిచ్ ఓడిపోయాడు. దీంతో అతడి అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడిన జొకోవిచ్.. మ్యాచ్ చివరి దశలో కోర్టులోనే కన్నీటి పర్యంతమయ్యాడు. ఆర్థర్ యాష్ స్టేడియం వేదికగా నాలుగు గంటలకు పైగా సాగిన ఈ హోరాహోరీ పోరులో నవోనే 7-6(5), 5-7, 4-6, 6-2, 6-1 తేడాతో జొకోవిచ్‌పై చారిత్రక విజయం సాధించాడు.

వివరాలు

తీవ్ర అస్వస్థతతో కనపడిన జాకోవిచ్

తొలి సెట్‌ను కోల్పోయినప్పటికీ.. 39 ఏళ్ల జొకోవిచ్ అద్భుతంగా పుంజుకున్నాడు. వరుసగా రెండో, మూడో సెట్లను గెలుచుకుని ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు.

అయితే ఆ తర్వాత అతడి శరీరం సహకరించలేదు. న్యూయార్క్‌లోని తీవ్రమైన తేమతో కూడిన వాతావరణం మ్యాచ్ ఆరంభం నుంచే జొకోవిచ్‌ను ఇబ్బంది పెట్టింది.

అతను పదేపదే ఐస్ ప్యాక్‌లు అద్దుకుంటూ తీవ్ర అస్వస్థతతో కనిపించాడు. మూడో సెట్ సమయంలో పలుమార్లు వాంతులు కూడా చేసుకున్నాడు.

దీంతో టోర్నమెంట్ ఫిజియోథెరపిస్ట్ కోర్టులోకి వచ్చి జొకోవిచ్‌కు చికిత్స అందించారు. కొన్ని ట్యాబ్లెట్లు కూడా ఇచ్చారు. అయినప్పటికీ.. నాలుగో సెట్ నుంచి నవోనే పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు.

వివరాలు

భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోయిన జాకోవిచ్

నిర్ణయాత్మక ఐదో సెట్‌లో ప్రత్యర్థి ఆధిక్యంలో దూసుకెళ్తున్న సమయంలో జొకోవిచ్ తన భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోయాడు.

అనారోగ్యంతో, వేడితో, ప్రత్యర్థితో పోరాడి అలసిపోయిన అతను కోర్టులోనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. స్టాండ్స్‌లో ఉన్న అతడి భార్య జెలెనా కూడా తీవ్ర ఆందోళనతో కనిపించారు.

ఈ ఓటమితో గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో జొకోవిచ్ సాధించిన వరుసగా 78 తొలి రౌండ్ విజయాల అసాధారణ రికార్డుకు తెరపడింది.

అతను చివరిసారిగా 2006ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఓ మేజర్ టోర్నీ తొలి రౌండ్‌లో ఓడిపోయాడు. ఈ ఫలితంతో జొకోవిచ్ 25వ మేజర్ టైటిల్ సాధించాలన్న ప్రయత్నానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది.

ఇటీవలే సిన్సినాటి ఓపెన్లోనూ వేడి కారణంగా ఇబ్బందిపడిన జొకోవిచ్.. తగినంత మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండానే యూఎస్ ఓపెన్‌లో అడుగుపెట్టడం గమనార్హం.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరలవుతున్న వీడియో

ADVERTISEMENT