LOADING...
IND vs SA: 'ఇకపై అలా చేయొద్దు'.. రెండో టెస్టుకు ముందు గిల్‌కు డాక్టర్ల క్లియర్ వార్నింగ్!
'ఇకపై అలా చేయొద్దు'.. రెండో టెస్టుకు ముందు గిల్‌కు డాక్టర్ల క్లియర్ వార్నింగ్!

IND vs SA: 'ఇకపై అలా చేయొద్దు'.. రెండో టెస్టుకు ముందు గిల్‌కు డాక్టర్ల క్లియర్ వార్నింగ్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 18, 2025
09:24 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ రెండో టెస్ట్‌కు దూరం కావడం దాదాపు ఖాయమైంది. నవంబర్ 22 నుంచి గౌహతిలో ప్రారంభం కానున్న రెండో టెస్టుకు అతను జట్టుతో కలిసి ప్రయాణించడం లేడని సమాచారం. గిల్ నిర్ణయాన్ని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ వర్గాలు వార్తా సంస్థ PTIకి ధృవీకరించాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, విమాన ప్రయాణం చేయవద్దని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే గిల్ గౌహతికి వెళ్లడం లేదు.

Details

రెండో టెస్టు భారత్‌కు కీలకం 

కోల్‌కతాలో జరిగిన తొలి టెస్టులో ఘోర పరాజయం తర్వాత, గౌహతి టెస్ట్ టీమిండియాకు అత్యంత కీలకంగా మారింది. సిరీస్‌లో ఓటమి తప్పించుకోవాలంటే, బారాబతి స్టేడియంలో విజయం సాధించాల్సిందే. ఈ నేపథ్యంలో కెప్టెన్ గాయ వార్త జట్టులో మరింత ఆందోళన కలిగిస్తోంది. తుది నిర్ణయం మంగళవారం వచ్చే అవకాశం పీటీఐ నివేదికలో గిల్‌కు రాబోయే నాలుగు రోజులు పూర్తిగా విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు పేర్కొంది. అందువల్ల రెండో టెస్ట్‌కు ఆయన అందుబాటులో ఉండే అవకాశాలు తగ్గాయని స్పష్టం చేసింది. అయితే గిల్ గాయం స్థితిని ప్రతిరోజూ పరిశీలిస్తున్నారని, మంగళవారం ఆయన గౌహతి ప్రయాణంపై తుది నిర్ణయం వచ్చే అవకాశం ఉందని వర్గాలు చెబుతున్నాయి.

Details

గిల్ గాయం ఎలా జరిగింది? 

కోల్‌కతా టెస్ట్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్ సమయంలో 3 బంతుల్లో 4 పరుగులు చేసిన గిల్ అకస్మాత్తుగా మెడ నొప్పితో ఇబ్బంది పడ్డాడు. దీంతో రిటైర్డ్ హర్ట్ అయి బయటకు వెళ్లాల్సి వచ్చింది. గాయం ప్రభావం కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో కూడా గిల్ బ్యాటింగ్ చేయలేకపోయాడు. శుభ్‌మాన్ గిల్ గౌహతి టెస్ట్‌ను కోల్పోతే, 2024 అక్టోబర్ తర్వాత అతను టెస్ట్ మ్యాచ్‌కు దూరమవడం ఇదే మొదటిసారి. అప్పటికే న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్‌కు గిల్ అందుబాటులో లేకపోయాడు.