Page Loader
అంతర్జాతీయ క్రికెట్‌కు సౌతాఫ్రికా ఆల్ రౌండర్ వీడ్కోలు
అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన పెట్రోరియస్

అంతర్జాతీయ క్రికెట్‌కు సౌతాఫ్రికా ఆల్ రౌండర్ వీడ్కోలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 09, 2023
04:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

సౌతాఫ్రికా ఆటగాడు ఆల్ రౌండర్ డ్వైన్ పెట్రోరియస్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఇకపై టీ20 ఫార్మాట్ పైనే దృష్టి సారిస్తానని పెట్రోరియస్ ప్రకటించాడు. ఇది తన కెరియర్లో అత్యంత కఠిన నిర్ణయమని పెట్రోరియస్ చెప్పారు. తాను ఇక టీ20లపై దృష్టి మళ్లిస్తున్నానని, ఉత్తమ షార్ట్ ఫార్మాట్ ప్లేయర్ కావాలని తన లక్ష్యం సాధించడానికి సహాయపడుతుందని చెప్పారు. సెప్టెంబరు 2016లో సౌతాఫ్రికా జట్టులో పిట్రోరియస్ అరంగ్రేటం చేశాడు. 30 టీ20లు, 27 వన్డేలు, మూడు టెస్టులు ఆడాడు. వన్డే, టీ20 ఫార్మాట్లో ఒక్కో హాఫ్ సెంచరీ సాధించాడు. పిట్రోరియస్ చివరిసారిగా అక్టోబర్ 2022లో సౌతాఫ్రికా తరుపున ఆడాడు.

పిట్రోరియస్

చైన్నై సూపర్ కింగ్స్ తరుపున బరిలోకి..

2021 లో లాహోర్ T20Iలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ లో 5/17తో రాణించి రికార్డు బద్దలు కొట్టాడు. దక్షిణాఫ్రికా ఆరు వికెట్ల తేడాతో ఈ మ్యాచ్ లో సునాయాసంగా గెలిచింది. CSA క్రికెట్ డైరెక్టర్, ప్రిటోరియస్‌పై ప్రశంసలు కురిపించారు, ఒక ఆల్‌రౌండర్‌ను మిస్ అయ్యామని పేర్కొన్నాడు. ప్రిటోరియస్ ఎల్లప్పుడూ నిబద్ధతతో జట్టుకు సేవలందించారని కొనియాడారు. 2023లో మార్చి నుండి మే వరకు జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో చెన్నై సూపర్ కింగ్స్‌కు తరుపున ప్రిట్రోరియస్ ఆడనున్నారు.