Hardik Pandya: హార్దిక్ పాండ్యా నుంచి ఎమోషనల్ గిఫ్ట్.. నటాశా, అగస్త్యకు లగ్జరీ డిఫెండర్!
ఈ వార్తాకథనం ఏంటి
విడాకుల తర్వాత టీమిండియా ఆల్‌రౌండర్ హర్దిక్ పాండ్యా ప్రస్తుతం మహికా శర్మతో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆమె పేరులోని ఇనీషియల్స్‌ను టాటూగా వేయించుకోవడం, గర్ల్‌ఫ్రెండ్ బర్త్‌డేను ఘనంగా సెలబ్రేట్ చేయడం వార్తల్లో నిలిచాయి. అయితే డివోర్స్ తర్వాత కూడా మాజీ భార్య నటాశా స్టాంకోవిచ్, తన కుమారుడు అగస్త్య పాండ్యాపై హార్దిక్ ప్రేమ ఏమాత్రం తగ్గలేదని తాజా ఘటన మరోసారి నిరూపించింది. హార్దిక్ తన ఐదేళ్ల కుమారుడు అగస్త్యకు, అలాగే మాజీ భార్య నటాశాకు కొత్త ల్యాండ్ లోవర్ డిఫెండర్‌ను బహుమతిగా ఇచ్చాడు. ఈ లగ్జరీ SUV ధర సుమారు రూ.4 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.
Details
కారు తాళాలు అందుకుంటున్న అగస్త్య
ఈ వార్త సోషల్ మీడియాలో సంచలనం రేపింది. ముంబైలోని నవనిత్ మోటార్స్ షోరూమ్ ఈ సందర్భంగా ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఆ వీడియోలో చిన్నారి అగస్త్య కారు తాళాలు అందుకుంటుండగా, నటాశా అతని వెనుక నిలబడి కనిపిస్తుంది. బ్లాక్ కలర్‌లో ఉన్న ఈ ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 మోడల్ తన బోల్డ్ డిజైన్, ఆధునిక ఫీచర్లు, అత్యాధునిక సేఫ్టీ రగ్డ్ పనితీరుతో ప్రత్యేక గుర్తింపు పొందింది. జూలై 2024లో విడాకులు తీసుకున్న హార్దిక్, నటాశా ఇద్దరూ ప్రస్తుతం తమ కుమారుడి కోసం సమర్థవంతమైన కో-పేరెంటింగ్ కొనసాగిస్తున్నారు. సోషల్ మీడియాలో అగస్త్యతో గడిపే మధుర క్షణాలను తరచుగా షేర్ చేస్తూ ఉంటారు.
Details
విడిపోయినా కుమారుడిపై అపారమైన ప్రేమ
ఈ లగ్జరీ గిఫ్ట్ హార్దిక్ తన కుటుంబం పట్ల ఉన్న బాధ్యతాభావాన్ని, విడిపోయినా కుమారుడిపై ఉన్న అపారమైన ప్రేమను చూపిస్తోందని అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఇదే సమయంలో ఈ ఘటన ICC Men's T20 World Cup నేపథ్యంలో చోటుచేసుకోవడం, అలాగే మహికా శర్మ పుట్టినరోజు వేడుకల అనంతరం జరగడం మరింత చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో "డాడీ గోల్స్ అన్‌లాక్డ్" వంటి కామెంట్లు వైరల్ అవుతుండగా, "పాపా జైసా కోయి హార్దిక్ నహీ హై" అంటూ అభిమానులు స్పందిస్తున్నారు. మొత్తానికి, ఈ ఖరీదైన బహుమతితో హార్దిక్ పాండ్యా తన కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యతను మరోసారి స్పష్టంగా తెలియజేశాడు.