Page Loader
IND vs ENG 5th Test: టాస్ ఓడిన టీమిండియా.. దేవదత్ పడిక్కల్ అరంగేట్రం! 
IND vs ENG 5th Test: టాస్ ఓడిన టీమిండియా.. దేవదత్ పడిక్కల్ అరంగేట్రం!

IND vs ENG 5th Test: టాస్ ఓడిన టీమిండియా.. దేవదత్ పడిక్కల్ అరంగేట్రం! 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 07, 2024
10:01 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్, ఇంగ్లండ్ మధ్య చివరి టెస్టు మరికాసేపట్లో ప్రారంభం కానుంది. చివరిదైన ఐదో టెస్టు ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే నాలుగు టెస్టులు ఆడిన భారత్ 3-1 తేడాతో సిరీస్ ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. నాలుగో టెస్ట్ లో విశ్రాంతి తీసుకున్న బుమ్రా నేటి మ్యాచ్ల్లో ఆడేందుకు సిద్ధమయ్యారు. కాగా, భారత్ తరపున దేవదత్ పడిక్కల్ టెస్టు లోకి అరంగేట్రం చేశారు. స్పోర్ట్స్‌ 18, జియో సినిమాలో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.

Details 

భారత్, ఇంగ్లండ్ జట్లు ఇదే..

భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్‌), శుభమన్ గిల్, దేవదత్ పడిక్కల్, రవీంద్ర జడేజా, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్(వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, బెన్ స్టోక్స్(కెప్టెన్‌), జానీ బెయిర్‌స్టో, బెన్ ఫోక్స్(వికెట్‌ కీపర్‌), టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్