NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Stuart Broad: రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ స్టువర్ట్ బ్రాడ్
    తదుపరి వార్తా కథనం
    Stuart Broad: రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ స్టువర్ట్ బ్రాడ్
    రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ స్టువర్ట్ బ్రాడ్

    Stuart Broad: రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ స్టువర్ట్ బ్రాడ్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jul 30, 2023
    12:32 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇంగ్లండ్ స్టార్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్(Stuart Broad) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం జరుగుతున్న యాషెన్ సిరిస్‌లో 5వ టెస్టు మ్యాచ్ తనకు చివరిదని బ్రాడ్ వెల్లడించాడు.

    2006లో అంతర్జాతీయ క్రికెట్ ఆరంగేట్రం చేసిన స్టువర్ట్ బ్రాడ్ తన 17 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో అరుదైన రికార్డులను సాధించాడు.

    ఇంగ్లండ్ తరుపున 166 టెస్టుల్లో 27.68 సగటుతో 600 వికెట్లు తీశాడు. దీంతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు.

    2016లో చివరి వన్డే ఆడిన బ్రాడ్ అప్పటి నుంచి టెస్టులకే పరితమయ్యాడు. ఇంగ్లాండ్ తరపున జేమ్స్ అండర్సన్ 182 మ్యాచులు ఆడి అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. స్టువర్ట్ బ్రాడ్ 166 టెస్టులతో రెండో స్థానంలో ఉన్నాడు.

    Details

    స్టువర్ట్ బ్రాడ్ సాధించిన రికార్డులివే

    ఇంగ్లండ్ తరుపున 121 వన్డేలు, 56 టీ20లు, 166 టెస్టులు ఆడిన బ్రాడ్, ఇప్పటివరకూ అన్ని ఫార్మాట్లో కలిపి 845 వికెట్లు పడగొట్టాడు. తన కెరీర్‌లో నాలుగు సార్లు యాషెస్ కప్, ఒక టీ20 వరల్డ్ కప్ గెలిచాడు.

    ఇక వన్డేలో 178 వికెట్లు, టీ20ల్లో 65 వికెట్లను తీశాడు. టెస్టులో ఓ సెంచరీ, 13 అర్ధసెంచరీలతో 3640 పరుగులు చేశాడు.

    స్టువర్ట్ బ్రాడ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 260 మ్యాచులు ఆడి 930 వికెట్లను సాధించాడు. డేవిడ్ వార్నర్ ని 17 సార్లు ఔట్ చేసి టెస్టు క్రికెట్ చరిత్రలో ఓ ప్లేయర్ అత్యధిక సార్లు ఔట్ చేసిన బౌలర్‌గా రికార్డుకెక్కాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇంగ్లండ్
    క్రికెట్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    ఇంగ్లండ్

    టెస్టు సిరీస్‌పై కన్నేసిన ఇంగ్లండ్ క్రికెట్
    జో రూట్ సూపర్ సెంచరీ క్రికెట్
    ప్రపంచంలో తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించిన హ్యారీ బ్రూక్ క్రికెట్
    South Africa World Cup Final: చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా; ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్‌లోకి క్రికెట్

    క్రికెట్

    బ్యాట్ పట్టుకున్న కేన్ విలియమ్సన్..ఐపీఎల్ గాయం నుంచి కోలుకున్నట్లేనా? న్యూజిలాండ్
    వన్డే ప్రపంచ కప్ నుంచి జింబాబ్వే నిష్క్రమణ జింబాబ్వే
    వన్డే వరల్డ్ కప్ ముందు కీలక నిర్ణయం.. టీమిండియా చీఫ్ సెలక్టర్‌గా అజిత్ అగార్కర్ టీమిండియా
    టీమిండియా మాజీ ప్లేయర్‌కు తప్పిన పెను ప్రమాదం టీమిండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025