
ENG Vs NED : టాస్ గెలిచిన ఇంగ్లండ్.. బ్యాటింగ్ ఎవరిదంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా 40వ మ్యాచులో ఇవాళ డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ వర్సెస్ నెదర్లాండ్స్ జట్లు తలపడనున్నాయి.
పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొదటగా బ్యాటింగ్ ఎంచుకుంది.
పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఇంగ్లండ్, మిగిలిన రెండు మ్యాచుల్లో విజయం సాధించాలని పరువు నిలబెట్టుకోవాలని ఇంగ్లండ్ భావిస్తోంది.
మరోవైపు ఇంగ్లండ్ పై నెగ్గి ఐసీసీ ట్రోఫీకి అర్హత సాధించాలని నెదర్లాండ్స్ జట్టు గట్టి పట్టుదలతో ఉంది.
ఇప్పటివరకూ ఇంగ్లండ్, నెదర్లాండ్స్ మధ్య 3 మ్యాచులు జరగ్గా, అన్నింట్లోనూ ఇంగ్లండ్ జట్టు విజయం సాధించింది.
Details
ఇరు జట్లలోని సభ్యులు
నెదర్లాండ్స్ జట్టు
వెస్లీ బరేసి, మాక్స్ ఓడౌడ్, కోలిన్ అకెర్‌మాన్, సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, స్కాట్ ఎడ్వర్డ్స్(w/c), బాస్ డి లీడే, తేజా నిడమనూరు, లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, ఆర్యన్ దట్ట్, పాల్ వాన్ మీకెరెన్
ఇంగ్లండ్ జట్టు
జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(w/c), మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లీ, గుస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్