Loading...
Rahul Dravid: ద్రవిడ్‌ ఓనర్‌ అయినా.. మా పనుల్లో జోక్యం చేసుకోరు: విక్రమ్‌ రాఠోడ్
ద్రవిడ్‌ ఓనర్‌ అయినా.. మా పనుల్లో జోక్యం చేసుకోరు: విక్రమ్‌ రాఠోడ్

Rahul Dravid: ద్రవిడ్‌ ఓనర్‌ అయినా.. మా పనుల్లో జోక్యం చేసుకోరు: విక్రమ్‌ రాఠోడ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 11, 2026
11:26 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్ (Rahul Dravid) కొత్త పాత్రలోకి అడుగుపెట్టారు. ఇప్పటివరకు ఆటగాడిగా, కోచ్‌గా, మెంటార్‌గా వివిధ బాధ్యతలు చేపట్టిన ఆయన.. తొలిసారి ఓనర్‌గా మారారు. యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్‌లోని డబ్లిన్ గార్డియన్స్ జట్టుకు సహ యజమానిగా వ్యవహరించనున్నారు. ఈ జట్టుకు భారత్‌కు చెందిన విక్రమ్ రాఠోడ్ (Vikram Rathod) కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో భారత జట్టులో ద్రవిడ్ కోచింగ్ బృందంలో, ఐపీఎల్‌లోనూ విక్రమ్ రాఠోడ్ పనిచేశారు. ఇప్పుడు ద్రవిడ్ యాజమాన్యంలోనే రాఠోడ్ పనిచేస్తుండటం గమనార్హం. డబ్లిన్ గార్డియన్స్ ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడినా ఒక్క విజయం కూడా సాధించలేదు. అయినప్పటికీ రాహుల్ ద్రవిడ్ తమకు మద్దతుగా నిలిచారని విక్రమ్ రాఠోడ్ తెలిపారు.

వివరాలు

'మా పనుల్లో ద్రవిడ్‌ ఎక్కువగా జోక్యం చేసుకోరు'

రాహుల్ ద్రవిడ్ తమ జట్టుకు యజమాని అని విక్రమ్ రాఠోడ్ స్పష్టం చేశారు. అవును.. రాహుల్ ద్రవిడ్ మాకు యజమాని. ఆయన అలాగే వ్యవహరిస్తున్నారు.

అంటే.. మా పనుల్లో మరీ ఎక్కువగా జోక్యం చేసుకోరు. కోచింగ్ బృందానికి స్వేచ్ఛ ఇచ్చారు. ఇంతకుముందే చెప్పా.. రాహుల్ ద్రవిడ్‌తో కలిసి పనిచేయడం గొప్ప అనుభవం. కోచ్‌గానూ పనిచేసిన ఆయనకు ఆటపై పూర్తి పట్టు ఉంది.

జట్లు ఎలా ఆడతాయి? ఫలితాలు ఎలా వస్తాయి? అనే విషయాలు ఆయనకు తెలుసు అని రాఠోడ్ పేర్కొన్నారు.

టోర్నీ ప్రారంభంలో తమ జట్టు వరుసగా ఓటములను ఎదుర్కొందని ఆయన తెలిపారు. అయినప్పటికీ ద్రవిడ్ తమకు మద్దతుగా నిలిచారని చెప్పారు.

వివరాలు

అశ్విన్‌కు అపారమైన క్రికెట్‌ జ్ఞానం

టోర్నీ ఆరంభంలో మేం వరుసగా ఓటములను చవిచూశాం. అయినా ద్రవిడ్ మద్దతుగా నిలిచారు. తన కెరీర్‌లో రాహుల్ అద్భుతంగా రాణించారు.

అలాంటి వ్యక్తి నుంచి మనం ఆశించేది కూడా అదే. ఆ విషయంలో మమ్మల్ని ఎప్పుడూ నిరుత్సాహపరచలేదని విక్రమ్ రాఠోడ్ గుర్తు చేసుకున్నారు.

మరోవైపు డబ్లిన్ గార్డియన్స్ ఫ్రాంచైజీ వ్యవహారాలను రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) పర్యవేక్షిస్తున్నారని విక్రమ్ రాఠోడ్ తెలిపారు.

ఆటపట్ల అశ్విన్‌కు అపారమైన జ్ఞానం ఉందని ప్రశంసించారు. "ఫ్రాంచైజీ విషయాలను రవిచంద్రన్ అశ్విన్ పర్యవేక్షిస్తూ ఉంటాడు.

ADVERTISEMENT

వివరాలు

యువ క్రికెటర్ల నుంచి బాగా తెలుసు

ఆటపట్ల ఆయనకు ఉన్న జ్ఞానం అపారం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువ క్రికెటర్ల గురించి బాగా తెలుసు. ఎవరికి ఏ టాలెంట్ ఉందో అంచనా వేయడంలో అశ్విన్ నేర్పరి.

అతడు ఉండటం వల్ల నా పని ఇంకా తేలికగా మారిందని రాఠోడ్ అన్నారు.

తన కోచింగ్ కెరీర్‌లో ఎక్కువ భాగం భారత జట్టుతోనే కొనసాగిందని, ఇప్పుడు డబ్లిన్ గార్డియన్స్‌తో పనిచేయడం తనకు కొత్త అనుభవమని విక్రమ్ రాఠోడ్ తెలిపారు.

ADVERTISEMENT