LOADING...
IND vs PAK: దాయాదుల పోరుకు సర్వం సిద్ధం .. టీమిండియా రికార్డులివే.. ఫామ్‌లో హర్దిక్ పాండ్యా!
దాయాదుల పోరుకు సర్వం సిద్ధం .. టీమిండియా రికార్డులివే.. ఫామ్‌లో హర్దిక్ పాండ్యా!

IND vs PAK: దాయాదుల పోరుకు సర్వం సిద్ధం .. టీమిండియా రికార్డులివే.. ఫామ్‌లో హర్దిక్ పాండ్యా!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 13, 2026
03:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీమిండియా-పాకిస్థాన్ హై వోల్టేజ్ సమరానికి ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. టీమిండియాతో ఆడమని తొలుత మొండికేసిన పీసీబీ, ఐసీసీ హెచ్చరికల నేపథ్యంలో తన నిర్ణయాన్ని మార్చుకుంది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15, ఆదివారం రోజున కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియం వేదికగా ఈ దాయాదుల పోరు జరగనుంది.

Details

టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ ఆధిక్యం

గత గణాంకాలను పరిశీలిస్తే టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌పై భారత్‌కు స్పష్టమైన ఆధిక్యం ఉంది. ఇప్పటివరకు జరిగిన 9 టీ20 ప్రపంచకప్‌లలో ఇరు జట్లు 8 సార్లు తలపడగా, భారత్ 7 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. పాకిస్థాన్ మాత్రం 2021లో ఒక్కసారి మాత్రమే గెలిచింది. ఓవరాల్ టీ20 రికార్డు మొత్తం టీ20ల్లో భారత్-పాక్ జట్లు 16 సార్లు ముఖాముఖి కాగా, అందులో భారత్ 13 మ్యాచ్‌ల్లో గెలిచింది. పాకిస్థాన్ ఖాతాలో 3 విజయాలు ఉన్నాయి.

Details

కీలక ఆటగాళ్ల గణాంకాలివే

తిలక్ వర్మ: ప్రస్తుత జట్టులో పాకిస్థాన్‌పై మంచి రికార్డు కలిగి ఉన్నాడు. మూడు ఇన్నింగ్స్‌ల్లో 130 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ: పాక్‌పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 11 మ్యాచ్‌ల్లో 492 పరుగులు సాధించాడు. హార్ధిక్ పాండ్యా : బౌలింగ్‌లో 15 వికెట్లు తీసి జట్టుకు కీలక ఆయుధంగా మారాడు. 2012లో ఇదే కొలంబో వేదికగా పాకిస్థాన్‌ను చిత్తు చేసిన టీమిండియా, మరోసారి అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని సంకల్పంతో ఉంది. ఐసీసీ జోక్యంతో పీసీబీ యూ-టర్న్ తీసుకోవడం క్రికెట్ అభిమానులకు శుభవార్తగా మారింది.

Advertisement