Loading...
KL Rahul: ఇప్పటికీ ఆ నిర్ణయం సరైంది కాదు.. వైస్ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
ఇప్పటికీ ఆ నిర్ణయం సరైంది కాదు.. వైస్ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు

KL Rahul: ఇప్పటికీ ఆ నిర్ణయం సరైంది కాదు.. వైస్ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు

వ్రాసిన వారు Moogati Shabari
Aug 23, 2026
10:00 am

ఈ వార్తాకథనం ఏంటి

అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టు కోసం భారత జట్టును ప్రకటించిన సమయంలో బీసీసీఐ వైస్ కెప్టెన్సీని మార్చింది. ఇప్పుడు శ్రీలంకతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లోనూ రాహుల్‌నే కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు డిప్యూటీగా కొనసాగిస్తోంది. అయితే ఈ నిర్ణయం సరైంది కాదని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడిన ఆకాశ్ చోప్రా.. శుభ్‌మన్ గిల్‌కు కాస్త సమవయస్కుడైన ఆటగాడిని వైస్ కెప్టెన్‌గా నియమించి ఉంటే బాగుండేదని పేర్కొన్నాడు. భవిష్యత్‌లో గిల్ తర్వాత భారత టెస్టు జట్టుకు కెప్టెన్ అయ్యే అవకాశం వైస్ కెప్టెన్‌గా ఉన్న ఆటగాడికే ఎక్కువగా ఉంటుందని చెప్పాడు. అయితే కేఎల్ రాహుల్ ఇప్పటికే ఆ దశను దాటిపోయాడని వ్యాఖ్యానించాడు.

వివరాలు

అందుకే గిల్‌కు వైస్ కెప్టెన్సీ..

''వైస్ కెప్టెన్సీ విషయంలో జరుగుతున్న చర్చతో నేను ఏకీభవిస్తున్నాను.

కేఎల్ రాహుల్‌ను గిల్‌కు డిప్యూటీగా ఎందుకు నియమించారో నాకు అర్థం కావడం లేదు.

వీరిద్దరి మధ్య దాదాపు ఏడెనిమిదేళ్ల వయసు తేడా ఉంది. అయితే ఇక్కడ నేను కేఎల్ రాహుల్‌ను తక్కువ చేయడం లేదు.

అతడికి మంచి కెప్టెన్సీ ఆలోచనా శక్తి ఉంది. కానీ గిల్ తర్వాత భారత జట్టుకు కెప్టెన్ అయ్యే దశలో అతడు లేడు.

అందుకే గిల్‌కు వైస్ కెప్టెన్‌గా అతడికి కాస్త సమవయస్కుడైన ఆటగాడిని ఎంపిక చేసి ఉంటే బాగుండేది'' అని ఆకాశ్ చోప్రా తెలిపాడు.

వివరాలు

కుల్‌దీప్‌కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి: రహానే

శ్రీలంకతో తొలి టెస్టులో కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీసిన కుల్‌దీప్ యాదవ్‌కు జట్టు మేనేజ్‌మెంట్ అండగా నిలవాలని భారత మాజీ క్రికెటర్ అజింక్య రహానే సూచించాడు.

రెండో టెస్టులోనే కాకుండా రాబోయే సిరీస్‌ల్లోనూ అతడికి అవకాశాలు ఇవ్వాలని చెప్పాడు.

''కుల్‌దీప్ యాదవ్‌కు జట్టు మేనేజ్‌మెంట్ అండగా నిలవాలి. అతడికి తన వెనుక జట్టు ఉందనే నమ్మకం కల్పించాలి.

గతంలో ఎన్నో క్లిష్ట పరిస్థితుల్లోనూ కుల్‌దీప్ వికెట్లు సాధించాడు.

ఒక్కోసారి పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. అంతమాత్రాన అతడిని వెంటనే జట్టు నుంచి తప్పించాల్సిన అవసరం లేదు'' అని రహానే పేర్కొన్నాడు.

రెండో టెస్టులో పిచ్ కూడా స్పిన్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉందని రహానే తెలిపాడు.

ADVERTISEMENT