తదుపరి వార్తా కథనం
Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్‌కు వైస్ కెప్టెన్‌గా ఫాఫ్ డుప్లెసిస్
వ్రాసిన వారు
Sirish Praharaju
Mar 18, 2025
11:55 am
ఈ వార్తాకథనం ఏంటి
గత రెండు సీజన్లలో ఆర్‌సీబీకి నాయకత్వం వహించిన దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, త్వరలో ప్రారంభంకాబోయే ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
ఈ సీజన్‌కు బెంగళూరు అతడిని రిటైన్ చేయకపోవడంతో వేలంలో డుప్లెసిస్‌ను ఢిల్లీ రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది.
ఇప్పటికే ఢిల్లీ తమ ప్రధాన సారథిగా అక్షర్ పటేల్‌ను నియమించిన విషయం తెలిసిందే.
కెప్టెన్సీ అనుభవం తక్కువగా ఉన్న అక్షర్‌కు డుప్లెసిస్ లాంటి అనుభవం కలిగిన ఆటగాడు మద్దతుగా ఉండటం జట్టుకు ఉపయోగకరమని క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఢిల్లీ క్యాపిటల్స్‌కు వైస్ కెప్టెన్‌గా ఫాఫ్ డుప్లెసిస్
Faf du Plessis has been named as the vice-captain of Delhi Capitals of IPL 2025🙌
— SBM Cricket (@Sbettingmarkets) March 17, 2025
📸: Delhi Capitals#FafDuPlessi #DC #DelhiCapitals #IPL2025 #IPL #Cricket #SBM pic.twitter.com/BwcgqEY2pa