LOADING...
FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్‌లో సరికొత్త రికార్డు.. 33 మ్యాచ్‌ల్లోనే 100 గోల్స్ మైలురాయి!
ఫిఫా ప్రపంచకప్‌లో సరికొత్త రికార్డు.. 33 మ్యాచ్‌ల్లోనే 100 గోల్స్ మైలురాయి!

FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్‌లో సరికొత్త రికార్డు.. 33 మ్యాచ్‌ల్లోనే 100 గోల్స్ మైలురాయి!

వ్రాసిన వారు Moogati Shabari
Jun 21, 2026
01:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీ గోల్స్ పరంగా కొత్త చరిత్రను లిఖించింది. 68 ఏళ్ల తర్వాత అత్యంత వేగంగా 100 గోల్స్ నమోదైన ప్రపంచకప్‌గా ఈ ఎడిషన్ ప్రత్యేక గుర్తింపు పొందింది. కేవలం 33 మ్యాచ్‌ల్లోనే టోర్నీ 100 గోల్స్ మైలురాయిని చేరుకోవడం విశేషం. ఈ ప్రపంచకప్‌లో తొలి గోల్‌ను మెక్సికోకు చెందిన జూలియన్ క్వినోనెస్ దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో నమోదు చేశాడు. ఇక నెదర్లాండ్స్ స్టార్ ఆటగాడు కోడీ గాక్‌పో స్వీడన్‌పై 5-1 తేడాతో జట్టు విజయం సాధించిన మ్యాచ్‌లో తన జట్టు తరఫున మూడో గోల్ చేసి, టోర్నీలో నమోదైన 100వ గోల్‌కు కారకుడిగా నిలిచాడు.

వివరాలు

ప్రపంచకప్ చరిత్రలో 100 గోల్స్ మార్క్‌..

ప్రపంచకప్ చరిత్రలో 100 గోల్స్ మార్క్‌ను చేరుకోవడానికి కేవలం 33 మ్యాచ్‌లు మాత్రమే పట్టడం కొత్త రికార్డుగా నమోదైంది. అంతకుముందు 1982, 2014 ప్రపంచకప్‌లలో ఈ మైలురాయిని చేరుకోవడానికి 36 మ్యాచ్‌లు అవసరమయ్యాయి. 1978, 1994 టోర్నీల్లో 38 మ్యాచ్‌ల తర్వాతే 100 గోల్స్ నమోదయ్యాయి. 1954లో స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో కేవలం 20 మ్యాచ్‌ల్లోనే 100 గోల్స్ నమోదు కావడం ఇప్పటికీ ఆల్‌టైమ్ రికార్డుగా కొనసాగుతోంది. ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో మొత్తం 100 గోల్స్ నమోదు చేసిన ఎనిమిదో దేశంగా నెదర్లాండ్స్ నిలిచింది. స్వీడన్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్రియాన్ బ్రోబ్బే రెండు గోల్స్ చేయగా, అతను సాధించిన రెండో గోల్ ప్రపంచకప్‌లలో నెదర్లాండ్స్‌కు 100వ గోల్‌గా చరిత్రలో చోటు దక్కించుకుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న పోస్ట్..

Advertisement