Loading...
FIFA World cup: మూడో స్థానంపై ఆసక్తికర పోరు..నేడు ఫ్రాన్స్‌తో ఇంగ్లాండ్‌ ఢీ
మూడో స్థానంపై ఆసక్తికర పోరు..నేడు ఫ్రాన్స్‌తో ఇంగ్లాండ్‌ ఢీ

FIFA World cup: మూడో స్థానంపై ఆసక్తికర పోరు..నేడు ఫ్రాన్స్‌తో ఇంగ్లాండ్‌ ఢీ

వ్రాసిన వారు Moogati Shabari
Jul 18, 2026
09:23 am

ఈ వార్తాకథనం ఏంటి

ఫుట్‌ బాల్‌ ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్‌కు ముందు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్న మరో కీలక పోరు శనివారం జరగనుంది. సెమీఫైనల్లో పరాజయం పాలైన ఫ్రాన్స్‌, ఇంగ్లాండ్‌ జట్లు మూడో స్థానం కోసం తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ను ఫుట్‌బాల్‌లో 'బ్రాంజ్‌ ఫైనల్‌'గా పిలుస్తారు. టోర్నీలో గౌరవప్రదమైన స్థానాన్ని సొంతం చేసుకునే అవకాశంగా ఈ పోటిని భావిస్తారు.

వివరాలు

థర్డ్‌ ప్లేస్‌ ప్లేఆఫ్‌ చరిత్ర..

1934 ప్రపంచకప్‌లో ఫిఫా తొలిసారి మూడో స్థానం కోసం ప్రత్యేక మ్యాచ్‌ను నిర్వహించింది.

1938 టోర్నీలో కూడా ఇదే విధానం కొనసాగింది. అయితే రెండో ప్రపంచ యుద్ధం కారణంగా 1942, 1946 ప్రపంచకప్‌లు రద్దయ్యాయి.

1950 ప్రపంచకప్‌ను నాకౌట్‌ పద్ధతి కాకుండా రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ విధానంలో నిర్వహించారు.

లీగ్‌ దశలో నాలుగు గ్రూప్‌లలో అగ్రస్థానంలో నిలిచిన జట్ల మధ్య ఫైనల్‌ లీగ్‌ నిర్వహించి, పాయింట్ల ఆధారంగా తొలి మూడు స్థానాలను నిర్ణయించారు.

అందువల్ల ఆ టోర్నీలో మూడో స్థానం కోసం ప్రత్యేక ప్లేఆఫ్‌ అవసరం లేకపోయింది.

1954 ప్రపంచకప్‌ నుంచి మాత్రం థర్డ్‌ ప్లేస్‌ ప్లేఆఫ్‌ను క్రమం తప్పకుండా నిర్వహిస్తూ వస్తున్నారు.

వివరాలు

గోల్డెన్‌ బూట్‌పై ఎంబాపె దృష్టి..

ఈ మ్యాచ్‌ ఫ్రాన్స్‌ స్టార్‌ ఆటగాడు కిలియన్‌ ఎంబాపెకు మరింత కీలకంగా మారింది.

ప్రస్తుతం అతడు అర్జెంటీనా కెప్టెన్‌ లియోనల్‌ మెస్సితో కలిసి టోర్నీలో 8 గోల్స్‌తో సమానంగా ఉన్నాడు.

అయితే అసిస్ట్‌లలో మెస్సి 4తో ముందుండగా, ఎంబాపె ఖాతాలో 3 అసిస్ట్‌లు ఉన్నాయి.

దీంతో గోల్డెన్‌ బూట్‌ రేసులో మెస్సికే ఆధిక్యం ఉంది. మూడో స్థానం మ్యాచ్‌లో ఎంబాపె అదనపు గోల్‌ సాధిస్తే టోర్నీలో అత్యధిక గోల్స్‌ చేసిన ఆటగాడిగా నిలిచే అవకాశం ఉంది.

ADVERTISEMENT

వివరాలు

విజేతలకు ప్రత్యేక ఉంగరాలు

అమెరికాలో జరిగే ప్రధాన క్రీడా టోర్నీల్లో విజేతలకు చేతి ఉంగరాలు అందించడం ఆనవాయితీ.

ఇప్పుడు అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న 2026 ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో కూడా ఇదే సంప్రదాయాన్ని ఫిఫా ప్రవేశపెడుతోంది.

ప్రపంచకప్‌ ట్రోఫీ ఆకృతిలో ప్రత్యేకంగా 2026 ఉంగరాలను తయారుచేయిస్తోంది.

మొత్తం 2026 రింగ్‌లలో 30ను ఛాంపియన్‌ జట్టు సభ్యులకు అందజేస్తారు. మిగతా 1996 ఉంగరాలను అభిమానుల కోసం విక్రయానికి ఉంచనున్నారు.

ఈ ప్రతిష్టాత్మక ప్రపంచకప్‌ ఫైనల్‌ను వీక్షించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హాజరవనున్నట్లు సమాచారం.

ఈ విషయాన్ని ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్‌ఫాంటినో వెల్లడించారు. దీంతో ఫైనల్‌కు రాజకీయ, క్రీడా పరంగా మరింత ప్రాధాన్యం ఏర్పడింది.

ADVERTISEMENT