Page Loader
KKR: కేకేఆర్‌కు ఐదో ఓటమి.. ప్లే ఆఫ్స్‌కు చేరే ఛాన్సుందా?
కేకేఆర్‌కు ఐదో ఓటమి.. ప్లే ఆఫ్స్‌కు చేరే ఛాన్సుందా?

KKR: కేకేఆర్‌కు ఐదో ఓటమి.. ప్లే ఆఫ్స్‌కు చేరే ఛాన్సుందా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 22, 2025
10:34 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2025 సీజన్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ కోల్‌కతా నైట్‌ రైడర్స్ (కేకేఆర్)కి ఎదురుదెబ్బలు మోదలయ్యాయి. వరుసగా రెండో పరాజయాన్ని చవిచూసిన కేకేఆర్, సోమవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 39 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి 198 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ విజయంలో గిల్ (55 బంతుల్లో 90; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), సుదర్శన్ (36 బంతుల్లో 52; 6 ఫోర్లు, సిక్స్), బట్లర్ (23 బంతుల్లో 41 నాటౌట్;8 ఫోర్లు) కీలక పాత్ర పోషించారు. కేకేఆర్ బౌలర్లలో అరోరా, హర్షిత్ రాణా, రస్సెల్ తలో వికెట్ మాత్రమే తీశారు.

Details

కేకేఆర్

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన కేకేఆర్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులకే పరిమితమైంది. అజింక్యా రహానే (36 బంతుల్లో 50; 5 ఫోర్లు, సిక్స్) ఒంటరి పోరాటం చేసినా.. మిగతా బ్యాటర్లు తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. వెంకటేశ్ అయ్యర్ (14), రింకూ సింగ్ (17), రస్సెల్ (21), రమణ్‌దీప్ (1) విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ, రషీద్ ఖాన్ చెరో రెండు వికెట్లు తీసారు. మహ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ, వాషింగ్టన్ సుందర్, సాయి కిషోర్ తలో వికెట్ అందుకున్నారు.

Details

ప్లే ఆఫ్స్ ఆశలు బలహీనంగా..

ఇది కేకేఆర్‌కు ఐదో పరాజయం. ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడి కేవలం మూడు విజయాలతో 7వ స్థానంలో కొనసాగుతోంది. నెట్‌రన్‌రేట్ (.212) మెరుగ్గా ఉన్నా.. టాప్-4లోకి రావాలంటే మిగిలిన 6 మ్యాచ్‌ల్లో కనీసం ఐదు గెలవాల్సిందే. ఒకటి ఓడితే నెట్‌రన్‌రేట్, ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. కానీ మూడు మ్యాచులకు పైగా ఓడితే మాత్రం ప్లే ఆఫ్స్ అవకాశాలు గల్లంతయ్యే ప్రమాదం ఉంది.

Details

కేకేఆర్ వచ్చే మ్యాచ్‌లు 

ఏప్రిల్ 26: పంజాబ్ కింగ్స్‌తో ఏప్రిల్ 29: ఢిల్లీ క్యాపిటల్స్‌తో మే 4: రాజస్థాన్ రాయల్స్‌తో మే 7: చెన్నై సూపర్ కింగ్స్‌తో మే 10: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మే 17: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో