Page Loader
BCCI: టెస్ట్ క్రికెటర్లకు బీసీసీఐ గుడ్ న్యూస్.. ఒక్కో మ్యాచ్‌కు రూ.45 లక్షల ఇన్సెంటీవ్
BCCI: టెస్ట్ క్రికెటర్లకు బీసీసీఐ గుడ్ న్యూస్.. ఒక్కో మ్యాచ్‌కు రూ.45 లక్షల ఇన్సెంటీవ్

BCCI: టెస్ట్ క్రికెటర్లకు బీసీసీఐ గుడ్ న్యూస్.. ఒక్కో మ్యాచ్‌కు రూ.45 లక్షల ఇన్సెంటీవ్

వ్రాసిన వారు Stalin
Mar 09, 2024
04:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

Test Cricket Incentive Scheme: యువ ఆటగాళ్లలో టెస్టు క్రికెట్ పట్ల ఉత్సాహాన్ని పెంచేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI) టెస్ట్ ఫీజులను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు 'టెస్ట్ క్రికెట్ ఇన్సెంటివ్ స్కీమ్'ను ప్రారంభిస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జైషా వెల్లడించారు. ప్రతి సీజన్‌లో 7కంటే ఎక్కువ టెస్టులు ఆడే ఆటగాళ్లకు ఒక్కో మ్యాచ్‌కు రూ.45 లక్షల వరకు ఇవ్వబడుతుంది. గతంలో భారత క్రికెటర్లు ఒక టెస్టు ఆడినందుకు రూ.15లక్షలు చెల్లించేవారు. ఈ కొత్త పథకం ద్వారా రెగ్యులర్ టెస్టులు ఆడే క్రికెటర్లు ఆర్థికంగా భారీగా ప్రయోజనం పొందుతారు. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ మాత్రమే ఆడే క్రికెటర్లు, యువ క్రికెటర్లలో టెస్టు క్రికెట్‌పై ఆసక్తిని పెంచేందుకే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

బీసీసీఐ

ప్లేయింగ్ లెవెన్‍లో లేని వారికి రూ.రూ.22.5 లక్షలు

2022-23 సీజన్ నుంచి 'టెస్ట్ క్రికెట్ ఇన్సెంటివ్ స్కీమ్'ను అమలు చేయనున్నట్లు జైషా వెల్లడించారు. కొత్త స్కీమ్ ప్రకారం.. ఒక సీజన్‌లో భారత్ తరఫున 75 శాతానికి పైగా టెస్టు మ్యాచ్‌లు ఆడే ఆటగాళ్లకు ఒక్కో టెస్టు మ్యాచ్‌కు అదనంగా రూ.45 లక్షల ప్రోత్సాహకం అందజేస్తారు. ప్ర‌స్తుతం, ప్ర‌పంచంలోనే అత్యంత సంప‌న్న క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ ఒక్కో టెస్ట్ క్రికెట‌ర్‌కు మ్యాచ్ ఫీజుగా రూ.15 లక్షలు చెల్లిస్తోంది. ఈ పథకం కోసం బీసీసీఐ ఒక్కో సీజన్‌కు రూ.40 కోట్లు అదనంగా చెల్లించనుంది. 75 శాతం కంటే ఎక్కువ టెస్ట్ మ్యాచ్‌లకు ఎంపికై.. ప్లేయింగ్ ఎలెవన్‌లో లేని వారికి ఒక్కో మ్యాచ్‌కి అదనంగా రూ.22.5 లక్షల మ్యాచ్ ఫీజును బీసీసీఐ అందజేయనుంది.

బీసీసీఐ

ప్లేయింగ్ లెవెన్‌లో లేని ఆటగాళ్ల ఫీజు రెట్టింపు 

కొత్త పథకం ప్రకారం.. ఒక క్రికెటర్ ఒక సీజన్‌లో 4 లేదా అంతకంటే తక్కువ టెస్టులు ఆడితే.. సాధారణ మ్యాచ్ ఫీజు రూ.15లక్షలు చెల్లిస్తారు. అతను ప్లేయింగ్ లెవెన్‌లో ఉన్నా.. లేకున్నా రూ.15లక్షలు ఇవ్వబడుతుంది. ఒక క్రికెటర్ ఒక సీజన్‌లో 5 నుంచి 6 మ్యాచ్‌లు ఆడితే.. ప్లేయింగ్ లెవెన్‌లో ఉంటే రూ.30 లక్షలు అందుతాయి. ప్లేయింగ్ లెవెన్‌లో లేకపోతే రూ.15 లక్షలను బీసీసీ ఇస్తుంది. అంతకు ముందు ప్లేయింగ్ లెవెన్‌లో లేని ఆటగాళ్లకు బీసీసీఐ రూ.7.5లక్షల మాత్రమే చెల్లించేది ఇప్పుడు ఆ ఫీజును రెట్టింపు చేసింది.