Loading...
Mohammad Amir: ఐపీఎల్‌ వేలంలో పాక్‌ మాజీ పేసర్‌.. యూకే పౌరసత్వంతో ఎంట్రీకి ప్రయత్నాలు!
ఐపీఎల్‌ వేలంలో పాక్‌ మాజీ పేసర్‌.. యూకే పౌరసత్వంతో ఎంట్రీకి ప్రయత్నాలు!

Mohammad Amir: ఐపీఎల్‌ వేలంలో పాక్‌ మాజీ పేసర్‌.. యూకే పౌరసత్వంతో ఎంట్రీకి ప్రయత్నాలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 02, 2026
05:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ ఆమిర్‌కు ఐపీఎల్‌లో ఆడాలనే ఆసక్తి ఎప్పటి నుంచో ఉంది. అయితే అతడు పాకిస్థాన్‌కు చెందిన ఆటగాడు కావడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడే అవకాశం ఇప్పటివరకు దక్కలేదు. తాజాగా 2027 ఐపీఎల్ వేలంలో తన పేరును నమోదు చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ రెండో లేదా మూడో వారంలో వేలం జరిగే అవకాశం ఉంది. నవంబర్ 15లోగా పది ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ రిటైన్ ఆటగాళ్ల జాబితాను వెల్లడించాల్సి ఉంది.

వివరాలు

యూకే పౌరుడిగా బరిలోకి ఆమిర్!

మంగళవారం జరగనున్న అఫ్గానిస్థాన్ ప్రీమియర్ లీగ్ (APL) డ్రాఫ్ట్‌లో మహ్మద్ ఆమిర్ పేరు కూడా ఉంది.

అయితే అతడు పాకిస్థాన్ ఆటగాడిగా కాకుండా.. యూకే పౌరుడిగా తన పేరును నమోదు చేసుకోవడం ఆసక్తికరంగా మారింది.

ఒకవేళ ఏపీఎల్‌లో అతడికి అవకాశం లభిస్తే.. అదే విధంగా ఐపీఎల్‌లోనూ యూకే పౌరుడిగా ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేయనున్నట్లు సమాచారం.

అయితే ఈ విషయంలో బీసీసీఐ అనుమతి ఇస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

పాక్ సంతతికి చెందిన ఆటగాడు కావడంతో బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

వివరాలు

స్థానిక ఆటగాడిగా రిజిస్టర్

మహ్మద్ ఆమిర్ యూకేకు చెందిన లాయర్ నజ్రిస్ ఖాన్‌ను వివాహం చేసుకున్నాడు.

అవసరమైన చట్టపరమైన అనుమతులు పొందడంతో పాటు యూకే పౌరసత్వ పరీక్షలోనూ ఉత్తీర్ణత సాధించాడు. ఈ ఏడాది మేలో అధికారికంగా బ్రిటిష్ పాస్‌పోర్ట్‌ను అందుకున్నాడు.

దీంతో ఇంగ్లాండ్ క్రికెట్‌లో విదేశీ ఆటగాడిగా కాకుండా స్థానిక ఆటగాడిగా రిజిస్టర్ చేసుకున్నాడు. అయితే ఇప్పుడు తన స్వదేశమైన పాకిస్థాన్‌లో నిర్వహించే పాక్ ప్రీమియర్ లీగ్‌లో మాత్రం ఓవర్సీస్ ఆటగాడిగా మారడం గమనార్హం.

యూకే పౌరసత్వం ఆధారంగా ఐపీఎల్‌లో ఆడేందుకు ఆమిర్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? బీసీసీఐ నుంచి అనుమతి లభిస్తుందా? అన్నది వేచి చూడాలి.

ADVERTISEMENT