నాపై రెండుసార్లు హత్యాప్రయత్నం జరిగింది : మాజీ టెన్నిస్ స్టార్
జర్మన్ టెన్నిస్ ఆల్ టైమ్ గ్రేట్, వింబుల్డన్ విజేత బోరిస్ బెకర్ ఎనిమిదిమాసాల కారాగారవాసం తరువాత విడుదలయ్యాడు. రూ. 5 కోట్ల పౌండ్లు ఎగ్గొట్టి దివాళా ప్రకటించిన నేరానికి లండన్ కోర్టు దోషిగా ప్రకటించడంతో బెకర్‌కు జైలుశిక్ష పడింది. జైలు జీవితం బహుదుర్భరం అంటూ వాపోయాడు. జైలులో బోరిస్ కాదని, కేవలం A2923EV నెంబర్ మాత్రమే అన్నారు. జైలులో తనను చంపడానికి ప్రయత్నించారని బాధపడ్డాడు. కారాగార శిక్ష అనుభవిస్తున్న సమయంలో తనపైన ఇద్దరు సహ ఖైదీలు వేర్వేరుగా రెండుసార్లు హత్యా ప్రయత్నం చేశారని, డబ్బులు కావాలంటూ తనను వేధించారని వాపోయాడు. మరో 10 మంది సహఖైదీలు తనను కాపాడకుంటే..జైలులోనే తన జీవితం ముగిసిపోయి ఉండేదంటూ చెప్పుకొచ్చాడు
జైలు జీవితం నా నిజస్వరూపాన్ని మార్చేసింది : బోరిస్ బెకర్
బెకర్ రూ.5 కోట్ల పౌండ్లు అప్పులుచేసి దివాళా ప్రకటించాడు. స్పెయిన్ లోని మొజార్కా ద్వీపం బెకర్ పేరుతోనే ఉంది. దాని విలువ రూ.2 కోట్ల 50 లక్షల పౌండ్ల పైమాటే. అయితే ఆ విషయాన్ని కోర్టు ముందుంచకుండా బెకర్ నాటకమాడి దొరికిపోయాడు. బెకర్ తనపై మోసిన ఆరోపణలకు తాను దోషి అని కూడా అంగీకరించాడు. గతంలో తాను చేసిన తప్పులను ఇప్పుడు తప్పించుకోవాలని భావిస్తున్నానని, జైలు తన నిజస్వరూపాన్ని తిరిగి తీసుకొచ్చిందని బెకర్ చెప్పాడు. నాకు తప్పుడు స్నేహితులు ఉన్నారని కన్నీళ్లు పెట్టుకున్నాడు. 1985లో, 17 సంవత్సరాల వయస్సులో, బెకర్ తన మొదటి వింబుల్డన్ ఫైనల్‌ను గెలుచుకున్నాడు, పురుషుల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్న అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు.