Page Loader
IND vs AUS: గబ్బా టెస్టు.. భారత్‌ ముందు 275 పరుగుల లక్ష్యం.. బుమ్రా అరుదైన రికార్డు
గబ్బా టెస్టు.. భారత్‌ ముందు 275 పరుగుల లక్ష్యం.. బుమ్రా అరుదైన రికార్డు

IND vs AUS: గబ్బా టెస్టు.. భారత్‌ ముందు 275 పరుగుల లక్ష్యం.. బుమ్రా అరుదైన రికార్డు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 18, 2024
10:20 am

ఈ వార్తాకథనం ఏంటి

గబ్బా వేదికగా ఆస్ట్రేలియా - టీమిండియా జట్ల మధ్య మూడో టెస్టు ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఐదో రోజులో ఆసీస్ తమ రెండో ఇన్నింగ్స్‌ను 89/7 వద్ద డిక్లేర్డ్ చేస్తూ, భారత్‌ ముందు 275 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 445 పరుగులు చేయగా, భారత్ 260 పరుగులకు ఆలౌటైంది. 185 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను వేగంగా ఆడే ప్రయత్నంలో ఆసీస్ తమ వికెట్లు తక్కువ పరుగులకే చేజార్చుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ బాట్స్‌మెన్లపై భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. జస్‌ప్రీత్ బుమ్రా తన బౌలింగ్‌తో మ్యాచ్‌కు ఊపును అందించాడు.

details

కపిల్ దేవ్ రికార్డును బద్దలు కొట్టిన బుమ్రా

ఉస్మాన్ ఖవాజాను బౌల్డ్ చేసి భారత వికెట్ వేటను ప్రారంభించిన బుమ్రా, కీలక బ్యాటర్ మార్నస్ లబుషేన్‌ను పెవిలియన్ పంపి ఆసీస్‌ను దెబ్బతీశాడు. ఈ మ్యాచ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా భారత క్రికెట్‌లో ఒక అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా అవతరించాడు. 10 మ్యాచ్‌ల్లో 53 వికెట్లు తీసి, క్రికెట్ దిగ్గజం కపిల్‌దేవ్ 51 వికెట్ల రికార్డును బద్దలు కొట్టాడు. ఆస్ట్రేలియాపై భారత బౌలర్ల రికార్డులు జస్‌ప్రీత్ బుమ్రా : 10 మ్యాచుల్లో 53 వికెట్లు కపిల్ దేవ్ : 11 మ్యాచుల్లో 51 వికెట్లు అనిల్ కుంబ్లే : 10 మ్యాచుల్లో 49 వికెట్లు ఆర్. అశ్విన్ : 11 మ్యాచుల్లో 40 వికెట్లు

Details

89 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన ఆసీస్

భారత బౌలర్లు వరుస వికెట్లు తీసినా, ఆసీస్‌ దూకుడైన ఆటతీరును ప్రదర్శించింది. కెప్టెన్ పాట్ కమిన్స్ 22 పరుగులతో కాస్త సమయం కాపాడినా, చివరికి బుమ్రా బౌలింగ్‌లో అతను కూడా పెవిలియన్ చేరాడు. ఆసీస్ చివరి ఇన్నింగ్స్‌లో 89/7 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయడం ద్వారా, భారత్‌ ముందున్న లక్ష్యాన్ని 275 పరుగులుగా నిలిపింది. పిచ్ పరిస్థితులు, భారత బ్యాటర్ల పట్టుదల మీద మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. గబ్బా టెస్టు విజయం కోసం ఆసీస్‌ వేగంగా పరిగెత్తుతుంటే, భారత్‌ చరిత్రాత్మక విజయం కోసం ప్రయత్నిస్తోంది.