Gautam Gambhir: ర్యాంకులు కాదు.. నాకు ట్రోఫీలే ముఖ్యం: గౌతమ్ గంభీర్
ఈ వార్తాకథనం ఏంటి
శ్రీలంకతో రెండో టెస్టుకు టీమిండియా సిద్ధమవుతోంది. ఆదివారం నుంచి కొలంబో వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి టెస్టులో భారీ విజయం సాధించిన భారత్.. అదే జోరును కొనసాగించాలని చూస్తోంది. రెండో టెస్టులోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు.
వివరాలు
ఆ విషయంలో గంభీర్ ఏం చెప్పారంటే..
గతంలో ఎదురైన పరాజయాల గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదని గంభీర్ స్పష్టం చేశాడు.
టీమిండియా సరైన మార్గంలోనే పయనిస్తోందని పేర్కొన్నాడు. టెస్టు క్రికెట్‌లో భారత జట్టు ఇబ్బందులు ఎదుర్కొంటోందనే వాదనను ఆయన కొట్టిపారేశాడు.
''మేం ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. కొన్ని మ్యాచుల్లో ఫలితాలు మనకు అనుకూలంగా రానంత మాత్రాన జట్టు పతనమైనట్లు కాదు.
వివరాలు
ర్యాంకుల గురించి పట్టించుకోని గంభీర్..
ఇది జట్టు మార్పు దశలో భాగం. ర్యాంకుల గురించి మేం అసలు పట్టించుకోం.
గత ఇంగ్లాండ్ పర్యటన నుంచి మేం మంచి టెస్టు క్రికెట్ ఆడుతున్నాం. ప్రధాన కోచ్‌గా నా పని ట్రోఫీలు గెలవడమే.
నేను నమ్మేది కూడా అదే. నా దృష్టి మొత్తం దానిపైనే ఉంటుంది'' అని గౌతమ్ గంభీర్ స్పష్టం చేశాడు.