Page Loader
Gautam Gambhir: కంకషన్ వివాదంపై క్లారిటీ ఇచ్చిన గౌతమ్ గంభీర్ 
కంకషన్ వివాదంపై క్లారిటీ ఇచ్చిన గౌతమ్ గంభీర్

Gautam Gambhir: కంకషన్ వివాదంపై క్లారిటీ ఇచ్చిన గౌతమ్ గంభీర్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 03, 2025
12:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్ - ఇంగ్లండ్‌ మధ్య జరిగిన టీ20 సిరీస్‌లో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌ను తీసుకునే నిర్ణయం వివాదాస్పదమైంది. నాలుగో టీ20 మ్యాచ్‌లో శివమ్ దూబే గాయపడటంతో, అతని స్థానంలో హర్షిత్ రాణా కంకషన్ సబ్‌గా వచ్చి మూడు వికెట్లు తీసి భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నిర్ణయంపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అది సరైన కంకషన్ రిప్లేస్‌మెంట్ కాదని వారు చెప్పారు.

Details

వివరణ అడిగిన గంభీర్

ఈ వివాదంపై భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. ఐదో టీ20 మ్యాచ్‌ అనంతరం కెవిన్ పీటర్సన్ అడిగిన కంకషన్ రిప్లేస్‌మెంట్ అంశంపై గంభీర్ వివరణ ఇచ్చాడు. 'శివమ్‌ దూబే ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసే అవకాశం ఉన్నా, రెండు ఓవర్లలోనే రెండు వికెట్లు తీసి కీలక పాత్ర పోషించారని గంభీర్ పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలతో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ చేసిన 'ఇంపాక్ట్' వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చినట్లు భావించారు. భారత జట్టు ప్రదర్శనపై గంభీర్ మాట్లాడుతూ, 'ఇంగ్లండ్‌ చాలా బలమైన జట్టయితే, తాము ఓడిపోయినా భయపడలేదన్నారు.

Details

యువ ఆటగాళ్లకు మద్దతుగా ఉండాలి

ప్రతి మ్యాచ్‌లో దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించామని ఈ మ్యాచ్‌లో కూడా 250+ స్కోరు లక్ష్యంగా బరిలోకి దిగామని, యువ ఆటగాళ్లకు మద్దతుగా ఉండటం ముఖ్యం. అభిషేక్ శర్మ సెంచరీ, యువ క్రికెటర్ల నైపుణ్యం ద్వారా చాలా సానుకూల ఫలితాలు వచ్చాయని పేర్కొన్నాడు. రవి బిష్ణోయ్, వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌ జట్టుకి చాలా ముఖ్యమని, బ్యాటింగ్‌లో టాప్-7 దూకుడుగా ఆడాలని కోరుకుంటామన్నారు. అలాగే వన్డేల్లో ఇదే దూకుడైన ఆటతీరును కొనసాగించాలన్నదే తన ఉద్ధేశమని స్పష్టం చేశారు.