India womens doubles: సెమీస్‌కు గాయత్రి-ట్రీసా జోడీ.. 15 ఏళ్ల తర్వాత భారత్‌కు పతకం ఖాయం
ఈ వార్తాకథనం ఏంటి
బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ జోడీ పతకం ఖాయం చేసింది. క్వార్టర్ ఫైనల్‌లో విజయం సాధించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. దీంతో మహిళల డబుల్స్ విభాగంలో భారత్‌కు 15 ఏళ్ల తర్వాత పతకం దక్కనుంది. చివరిసారిగా 2011లో అశ్విని పొన్నప్ప-జ్వాలా గుత్తా జోడీ కాంస్య పతకం సాధించింది.
వివరాలు
తొలి గేమ్‌లో ఓడినా.. ఆ తర్వాత పుంజుకుని..
ఇటీవలే అర్జున అవార్డు అందుకున్న గాయత్రి గోపీచంద్ మరోసారి తన సత్తా చాటింది.
ట్రీసా జాలీతో కలిసి ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత జోడీకి తొలి గేమ్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది.
చైనాకు చెందిన జియా యి ఫాన్-ఝాంగ్ షు జియాన్ జోడీ 21-16తో తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది.
అయితే భారత జోడీ ఏమాత్రం నిరుత్సాహపడకుండా పుంజుకుంది.
హోరాహోరీగా సాగిన రెండో గేమ్‌లో గాయత్రి-ట్రీసా 21-15తో విజయం సాధించి మ్యాచ్‌ను సమం చేసింది.
వివరాలు
మహిళల డబుల్స్‌లో ఫైనల్‌కు చేరిన తొలి భారత జోడీగా రికార్డు..
ఇక నిర్ణయాత్మక మూడో గేమ్‌లోనూ భారత జోడీ అదే జోరును కొనసాగించింది.
ఆరంభంలో ప్రత్యర్థి నుంచి కాస్త పోటీ ఎదురైనా.. గాయత్రి-ట్రీసా వెనక్కి తగ్గలేదు.
చివరికి 21-13తో మూడో గేమ్‌ను గెలుచుకుని మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.
ఇక సెమీఫైనల్‌లోనూ విజయం సాధిస్తే.. ప్రపంచ ఛాంపియన్‌షిప్ మహిళల డబుల్స్‌లో ఫైనల్‌కు చేరిన తొలి భారత జోడీగా గాయత్రి-ట్రీసా చరిత్ర సృష్టించనుంది.