
IPL 2025: 'ఏ ఆటగాడికైనా ఫామ్ అత్యంత కీలకం' : గిల్‌క్రిస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
సంపద పరంగా ప్రపంచంలోని అత్యంత విలువైన క్రికెట్ టోర్నీలలో ఐపీఎల్ (IPL) అగ్రస్థానంలో ఉంటుంది.
ఒకసారి ఏదైనా ఫ్రాంచైజీ దృష్టిలో పడితే,ఆ ఆటగాడి భవిష్యత్తు మారిపోతుంది.భారీగా డబ్బు ప్రవాహం ఉంటుందనే చెప్పాలి.
ఫామ్‌లో ఉంటే రాజసంగా జీవించే అవకాశాలు సిద్ధంగా ఉంటాయి.అయితే,ఫామ్ కోల్పోయినప్పుడో, బౌలింగ్ రిథమ్ తప్పినప్పుడో ఫ్రాంచైజీలు ఆ ఆటగాడిని వదులుకోవడానికి ఏ మాత్రం వెనుకాడవు.
ప్రస్తుతానికి, ఆసీస్ యువ క్రికెటర్ జేక్ ఫ్రేజర్ పరిస్థితి కూడా ఇలాంటి దశలోనే ఉందని మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ అభిప్రాయపడ్డాడు.
గత ఏడాది ఐపీఎల్‌లో అడుగుపెట్టిన జేక్,ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున తన ప్రదర్శనను చాటుకున్నాడు.
కానీ,ఈసారి మళ్లీ బరిలోకి దిగుతున్నప్పటికీ,అతని ప్రస్తుత ఫామ్ ఆందోళన కలిగిస్తోంది.ఈ విషయంపై గిల్‌క్రిస్ట్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
వివరాలు
కీలక వ్యాఖ్యలు చేసిన గిల్‌క్రిస్ట్
"జేక్ ఫ్రేజర్‌పై ఢిల్లీ ఫ్రాంచైజీ గట్టి నమ్మకం పెట్టుకుంది. అతడు ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి. ఈ సీజన్‌ను శక్తివంతంగా ఆరంభించాలి. ఐపీఎల్ గురించి నాకు తెలిసినదంతా చెప్పగలను. ఫ్రాంచైజీలు, కోచ్‌లు, యజమానులు ఎవరైనా సరే, ఫలితాలు ఆశించిన విధంగా రాకపోతే సహనం కోల్పోతారు. అందుకే, జేక్‌కు నా సూచన - తొలి మ్యాచ్ నుంచే తన ప్రతిభను చూపించాలి. గత సీజన్‌లో ఇదే మైదానంలో అదరగొట్టాడు. అతని దూకుడు శైలికి ఈ పిచ్ అనుకూలంగా ఉంటుంది అని నేను భావిస్తున్నా. అందుబాటులో ఉన్న అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి" అని గిల్‌క్రిస్ట్ పేర్కొన్నాడు.
వివరాలు
ఫాఫ్ డుప్లెసిస్‌తో ఓపెనింగ్..?
ఆసీస్‌కు చెందిన జేక్ ఫ్రేజర్ దూకుడుగా ఆడటంలో ప్రావీణ్యం కలిగిన ఆటగాడు.
గత సీజన్‌లో 9 ఇన్నింగ్స్‌ల్లో 234.04 స్ట్రైక్‌రేట్‌తో 330 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు అర్ధశతకాలు ఉన్నాయి.
అయితే, అంతర్జాతీయ స్థాయిలో మాత్రం అతని ఫామ్ ఆశించిన స్థాయిలో లేదు. 24 ఇన్నింగ్స్‌ల్లో అతను కేవలం 384 పరుగులే చేశాడు.
అయినప్పటికీ, ఢిల్లీ ఫ్రాంచైజీ అతడిపై నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ రూ. 9 కోట్లు వెచ్చించింది.
ఈసారి ఫాఫ్ డుప్లెసిస్‌తో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
2026 టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవాలంటే, ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో అతను మెరుగైన ప్రదర్శన చేయాల్సిందే.