LOADING...
Shubman Gill: తొలి టెస్టులోనే చరిత్ర సృష్టించిన గిల్.. కోహ్లీని అధిగమించాడు!
తొలి టెస్టులోనే చరిత్ర సృష్టించిన గిల్.. కోహ్లీని అధిగమించాడు!

Shubman Gill: తొలి టెస్టులోనే చరిత్ర సృష్టించిన గిల్.. కోహ్లీని అధిగమించాడు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 21, 2025
10:23 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్‌తో కఠిన పరిస్థితుల్లో ఎలా రాణిస్తారో అనుమానాలున్న సమయంలో టీమిండియా యువక్రికెటర్లు తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచారు. శుక్రవారం ప్రారంభమైన తొలి టెస్ట్ మొదటి రోజు టీమిండియా సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ముఖ్యంగా కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌ ఆడిన శుభ్‌మన్ గిల్ (Shubman Gill) అద్భుత శతకంతో జట్టును ముందుండి నడిపించాడు. ఈ క్రమంలో పలు కీలక రికార్డులను కూడా తన పేరిట లిఖించుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మొదటి రోజు శుభ్‌మన్ గిల్ 127 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. గిల్ టెస్ట్ కెరీర్‌లో ఇది ఆరో శతకం కావడం విశేషం.

Details

విదేశీ గడ్డపై సెంచరీ

అంతకుముందు ఆసియా వెలుపల శతకం చేయని గిల్, తొలిసారిగా విదేశీ మైదానంలో శతకాన్ని నమోదు చేశాడు. కెప్టెన్‌గా తొలి టెస్ట్‌లోనే శతకం చేసిన అతి పిన్న వయస్కుడైన భారత కెప్టెన్‌గా గిల్ రికార్డు సృష్టించాడు. 25 సంవత్సరాల 285 రోజుల వయసులో శతకాన్ని పూర్తి చేసి, విరాట్ కోహ్లీ(26 సంవత్సరాలు 34 రోజులు)రికార్డును అధిగమించాడు. అలాగే విదేశీ గడ్డపై శతకం చేసిన మూడో అతి పిన్న వయస్కుడైన భారత కెప్టెన్‌గా గిల్ నిలిచాడు. గిల్ కన్నా ముందు సచిన్ టెండూల్కర్(23 సంవత్సరాల 253 రోజులు), కపిల్ దేవ్(24 సంవత్సరాల 64 రోజులు) మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. అంతేకాకుండా, గిల్ తన తాజా ఇన్నింగ్స్‌తో 2000 టెస్ట్ పరుగుల మైలురాయిని కూడా చేరుకున్నాడు.