Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో గోల్డ్ మెడల్
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా గేమ్స్ లో భారత మహిళా జట్టు సత్తా చాటింది. ఫైనల్‌లో శ్రీలంకపై 19 పరుగుల తేడాతో గెలిచి స్వర్ణం సాధించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా, నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది.
లక్ష్య చేధనలో శ్రీలంక 8 వికెట్ల నష్టానికి 97 పరుగులే చేసింది. 18 ఏళ్ల భారత బౌలర్ టిటిస్ సాధు, వరుస ఓవర్లలో ఆటపట్టు(12), అనుష్కసంజీవని (1), గుణరత్నే(0)లను ఔట్ చేసి శ్రీలంకకు గట్టి షాకిచ్చింది.
హాసిని పెరీరా(25), నీలాక్షిడి సిల్వా(23), ఓషద రణసింగ్(19) రాణించినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు.
భారత బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్ 2, పూజా వస్త్రాకర్, దీప్తిశర్మ, దేవిక తలా ఓ వికెట్ పడగొట్టారు.
Details
రాణించిన స్మృతి మంధాన, జెమీయా రోడ్రిగ్స్
ఇక భారత బ్యాటర్లలో స్మృతి మంధాన (46), జెమీయా రోడ్రిగ్స్ (42) కీలక ఇన్నింగ్స్‌తో రాణించారు. వీరిద్దరూ మినహా మిగతా వారు విఫలమయ్యారు.
శ్రీలంక బౌలర్లలో ఉదేశిక ప్రబోధని, సుగందిక కుమారి, ఇనోక రణవీర రెండేసి వికెట్లు తీశారు.
మరోవైపు ఆసియా క్రీడల్లో భారత్ 10 మీటర్ల పురుషుల ఎయిర్ రైఫిల్ జట్టు మొదటి స్వర్ణ పతకాన్ని సాధించిన విషయం తెలిసిందే.