LOADING...
ICC : భారత్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఛాంపియన్స్ ట్రోఫీ‌లో భారత్ మ్యాచులకు అదనపు టికెట్లు
భారత్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఛాంపియన్స్ ట్రోఫీ‌లో భారత్ మ్యాచులకు అదనపు టికెట్లు

ICC : భారత్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఛాంపియన్స్ ట్రోఫీ‌లో భారత్ మ్యాచులకు అదనపు టికెట్లు

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 16, 2025
03:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు మ్యాచ్‌లు చూడాలనుకునే అభిమానులకు ఐసీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. అదనంగా టికెట్లను విడుదల చేయాలని నిర్ణయించడంతో పాటు, మధ్యాహ్నం నుంచే ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చింది. ఫైనల్‌ మ్యాచ్‌ టికెట్ల విషయానికొస్తే, మొదటి సెమీ ఫైనల్ ముగిశాక అవి విడుదల చేసే అవకాశముంది. టీమిండియా ఫైనల్‌కు చేరితే, ఆ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరుగనుంది. దీంతో ఫైనల్ వేదిక ఖరారు కావాలంటే, మొదటి సెమీస్ ఫలితం రావాల్సి ఉంటుంది. గ్రూప్ స్టేజ్‌లో భారత్ తన తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో ఆడనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 23న పాకిస్థాన్‌, మార్చి 2న న్యూజిలాండ్‌తో తలపడనుంది. తొలిసెమీఫైనల్ మార్చి 4న జరగనుంది.

Details

భారత్ సెమీస్ లో గెలిస్తే ఫైనల్ మ్యాచ్ లాహోర్ లోనే

'భారత్‌ తొలి మ్యాచ్‌ కోసం ఇప్పటికే టికెట్లు అందుబాటులో ఉంచారు. అలాగే పాకిస్థాన్, న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లను వీక్షించాలనుకునే అభిమానుల కోసం కూడా టికెట్లు సిద్ధంగా ఉన్నాయి. అదనంగా మరికొన్ని టికెట్లను విడుదల చేశారు. అయితే సెమీస్‌ టికెట్ల పరిమితి ఉంటుందని, ఇక ఫైనల్‌ మ్యాచ్‌ టికెట్లు ఇప్పుడే విడుదల చేయలేదన్నారు. భారత్‌ సెమీస్‌ గెలిచి ఫైనల్‌కు వస్తే దుబాయ్‌లో ఆతిథ్యం ఇస్తామని, లేకపోతే, టైటిల్ పోరు లాహోర్‌లోనే జరగనుందని ఐసీసీ స్పష్టం చేసింది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ Aలో భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. పాకిస్థాన్ ఆతిథ్యంతో టోర్నమెంట్‌ జరగనుంది. ఫిబ్రవరి 19న పాకిస్థాన్ - న్యూజిలాండ్‌ మధ్య మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది.