Loading...
Operation Ganga: మోహన్‌లాల్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. 'ఆపరేషన్‌ గంగా' ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది
మోహన్‌లాల్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. 'ఆపరేషన్‌ గంగా' ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది

Operation Ganga: మోహన్‌లాల్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. 'ఆపరేషన్‌ గంగా' ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 05, 2026
02:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ నుంచి మరో ఆసక్తికరమైన సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రయోగాత్మక కథలు, భారీ స్థాయి చిత్రాలతో మలయాళ సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ సీనియర్‌ స్టార్‌.. తన కొత్త ప్రాజెక్ట్‌ను తాజాగా అధికారికంగా ప్రకటించారు. 'మెప్పాడియన్‌' సినిమాతో దర్శకుడిగా పరిచయమై జాతీయ అవార్డు అందుకున్న విష్ణు మోహన్‌తో మోహన్‌లాల్‌ తొలిసారి కలిసి పనిచేస్తున్నారు. ఇంతకాలం L367 అనే వర్కింగ్‌ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ సినిమాకు తాజాగా 'ఆపరేషన్‌ గంగా' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. సోషల్‌ మీడియా వేదికగా మోహన్‌లాల్‌ ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను పంచుకున్నారు. పోస్టర్‌లో భారీ మహిళా విగ్రహం కనిపిస్తోంది.

వివరాలు

'ఎ నేషన్స్ ప్రామిస్‌' అనే ట్యాగ్‌లైన్‌పై ఆసక్తి

ఆ విగ్రహం ఒక చేతిలో కత్తి, మరో చేతిలో డాలు పట్టుకుని ఉండగా.. చుట్టూ దట్టమైన మేఘాలు కనిపిస్తున్నాయి. విగ్రహం పక్కనే ఓ యుద్ధ విమానం కూడా దర్శనమిస్తోంది.

పోస్టర్‌పై 'ఆపరేషన్‌ గంగా' అనే టైటిల్‌తో పాటు 'ఎ నేషన్స్ ప్రామిస్‌' అనే ట్యాగ్‌లైన్‌ ఉండటం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ సమయంలో భారతీయులను రక్షించేందుకు చేపట్టిన మిషన్‌ ఆధారంగా ఈ పాన్‌ ఇండియా యాక్షన్‌ థ్రిల్లర్‌ తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.

ఇందులో మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో నటించనున్నారు. బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు.

అందాల భామ భాగ్యశ్రీ బోర్సే, తమిళ నటుడు పార్థిబన్‌, నటుడు ఆదిల్‌ హుస్సేన్‌ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు.

వివరాలు

రెండో సినిమాకే మోహన్‌లాల్‌తో..

'ధురంధర్‌' సినిమాతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శశ్వత్‌ సచ్‌దేవ్‌ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.

దర్శకుడు విష్ణు మోహన్‌కు ఇది రెండో ఫీచర్‌ సినిమా. 2022లో విడుదలైన 'మెప్పాడియన్‌'తో దర్శకుడిగా ఆయన సినీ రంగ ప్రవేశం చేశారు.

తొలి సినిమాతోనే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఉన్ని ముకుందన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'మెప్పాడియన్‌' విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు.. విష్ణు మోహన్‌కు జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ తొలి దర్శకుడి అవార్డును అందించింది.

ఇప్పుడు తన రెండో సినిమాకే మోహన్‌లాల్‌ వంటి సీనియర్‌ స్టార్‌తో భారీ స్థాయి కథను తెరకెక్కించే అవకాశం దక్కడం విశేషంగా మారింది.

ADVERTISEMENT

వివరాలు

త్వరలోనే విడుదల తేదీని అనౌన్స్ చేసే అవకాశం

ప్రస్తుతం 'ఆపరేషన్‌ గంగా' కథకు సంబంధించిన పూర్తి వివరాలను చిత్రబృందం గోప్యంగా ఉంచుతోంది.

మోహన్‌లాల్‌ ఏ పాత్రలో కనిపించనున్నారు? అర్జున్‌ రాంపాల్‌ పాత్ర ఏమిటి? భాగ్యశ్రీ బోర్సేకు ఎలాంటి క్యారెక్టర్‌ దక్కింది? అసలు కథకు 'ఆపరేషన్‌ గంగా' మిషన్‌తో ఎంతవరకు సంబంధం ఉంది? అనే అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

అలాగే షూటింగ్‌ షెడ్యూల్‌, ఇతర నటీనటులు, విడుదల తేదీ వంటి వివరాలను కూడా త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.

ADVERTISEMENT

వివరాలు

వరుస సినిమాలతో మోహన్‌లాల్‌ బిజీ..

ప్రస్తుతం మోహన్‌ లాల్‌ తన కెరీర్‌లోనే అత్యంత బిజీ ఫేజ్‌లో ఉన్నారు.

ఇటీవల ఒకేసారి ఏడుగురు ప్రముఖ దర్శకులతో వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లను అధికారికంగా ప్రకటించి సినీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించారు.

అందులో విష్ణు మోహన్‌ తెరకెక్కిస్తున్న 'ఆపరేషన్‌ గంగా' కూడా ఒకటి.

దీనితో పాటు తరుణ్‌ మూర్తి దర్శకత్వంలో మీరా జాస్మిన్‌తో కలిసి మోహన్‌లాల్‌ నటిస్తున్న క్రైమ్‌ యాక్షన్‌-కామెడీ డ్రామా 'అతిమనోహరం' 2026 డిసెంబర్‌ 24న క్రిస్మస్‌ కానుకగా థియేటర్లలో విడుదల కానుంది.

అలాగే ప్రముఖ దర్శకుడు దిలీష్‌ పోతన్‌ తెరకెక్కిస్తున్న వినూత్న చిత్రం 'నెడుంకండం మిరాకిల్‌', సత్యన్‌ అంతికాడ్‌ కుమారుడు అనూప్‌ సత్యన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరికొత్త యాక్షన్‌-కామెడీ చిత్రం కూడా ఆయన లైనప్‌లో ఉన్నాయి.

వివరాలు

అత్యంత ప్రతిష్టాత్మకంగా 100వ సినిమా

మోహన్‌లాల్‌కు ఎన్నో క్లాసిక్‌ హిట్స్‌ అందించిన ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్‌ తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ సినిమాను మోహన్‌లాల్‌ హీరోగా తెరకెక్కించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

వీటితో పాటు 'దృశ్యం' ఫేమ్‌ జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో ఓ సినిమా, సత్యన్‌ అంతికాడ్‌తో కలిసి ఓ ఫ్యామిలీ డ్రామా చేసేందుకు కూడా మోహన్‌లాల్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

సోలో సినిమాలతో పాటు ఇతర హీరోల చిత్రాల్లోనూ మోహన్‌లాల్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

రజనీకాంత్‌ నటిస్తున్న 'జైలర్‌ 2'లో 'మ్యాథ్యూ' పాత్రలో, పృథ్విరాజ్‌ సుకుమారన్‌ తెరకెక్కిస్తున్న 'ఖలీఫా' చిత్రంలో ప్రత్యేకమైన అతిథి పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించబోతున్నారు.

ADVERTISEMENT