LOADING...
Hardik Pandya: పాండ్యా రీఎంట్రీకి మరోసారి బ్రేక్.. ఇంగ్లాండ్ సిరీస్ మిస్సయ్యే అవకాశం
పాండ్యా రీఎంట్రీకి మరోసారి బ్రేక్.. ఇంగ్లాండ్ సిరీస్ మిస్సయ్యే అవకాశం

Hardik Pandya: పాండ్యా రీఎంట్రీకి మరోసారి బ్రేక్.. ఇంగ్లాండ్ సిరీస్ మిస్సయ్యే అవకాశం

వ్రాసిన వారు Moogati Shabari
Jun 20, 2026
03:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత జట్టు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ఇంగ్లాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు కూడా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అఫ్గానిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు గాయంతో దూరమైన పాండ్య, ఇప్పటికీ పూర్తిస్థాయిలో కోలుకోలేదని సమాచారం. ఐపీఎల్ సందర్భంగా అతడికి తగిలిన గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి మరింత సమయం అవసరమని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ వైద్య బృందం సూచించినట్లు తెలుస్తోంది.

వివరాలు

ఇంగ్లాండ్ పర్యటనలో ఐదు టీ20లు..

భారత్ జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఐదు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్ జులై 1 నుంచి ప్రారంభం కానుంది. చాలా కాలం తర్వాత వన్డే ఫార్మాట్‌లో తిరిగి బరిలోకి దిగాలని హార్దిక్ పాండ్య ఆశించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో అతడు జట్టుతో వెళ్లే అవకాశం కనిపించడం లేదు. దీంతో సెలెక్టర్లు అతడి స్థానంలో మరో ఆటగాడిని ఎంపిక చేసే అవకాశాలు పెరిగాయి.

వివరాలు

వచ్చే ఏడాది దక్షిణాఫ్రికాలో వన్డే ప్రపంచకప్..

పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్య పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత జట్టుకు అత్యంత కీలకమైన ఆటగాడు. అయితే గాయాల కారణంగా వరుసగా వన్డే సిరీస్‌లకు దూరమవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికాలో వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో పాండ్యను పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌తో సిద్ధం చేయడం అత్యంత ముఖ్యమని సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ ఇటీవల స్పష్టం చేశారు. అతడు పూర్తిగా కోలుకున్న వెంటనే అవసరాన్ని బట్టి జట్టులోకి తీసుకునే అవకాశం ఉంటుందని కూడా ఆయన వెల్లడించారు.

Advertisement