Hardik Pandya: హార్దిక్ పాండ్య 'రుద్ర' వాచ్ ధర.. పాక్ కెప్టెన్ జీతం కంటే మూడు రెట్లు ధర ఎక్కువ
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా ఆల్‌రౌండర్ 'హార్దిక్ పాండ్య' తన విభిన్నమైన ఫ్యాషన్ స్టైల్స్‌తో ఎల్లప్పుడూ అభిమానులను ఆకట్టుకుంటుంటాడు. గత ఆసియా కప్‌లో కొత్త హెయిర్‌స్టైల్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అతడు, ఈసారి కూడా అదే స్టైల్ను కొనసాగించాడు. అయితే ఈ టీ20 ప్రపంచ కప్ సందర్భంగా హార్దిక్ ధరించిన వాచ్ ప్రత్యేక హైలైట్‌గా మారింది. సోషల్ మీడియాలో ఈ వాచ్ ధర, పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘా నెలవారీ జీతం కంటే మూడు రెట్లు ఎక్కువ అని చర్చ జరుగుతోంది. మహాశివరాత్రి నాడు జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. హార్దిక్ తన తొలి ఓవర్‌లోనే వికెట్ తీసి జట్టు విజయానికి దారితీశాడు.
Details
రూ.25 లక్షలు ధర
కానీ అభిమానులను ఆకట్టుకున్నది అతడి ప్రదర్శనతో పాటు తన చేతిలో ధరించిన వాచ్. ఈ వాచ్ డిస్‌ప్లేలో ధ్యానంలో ఉన్న 'పరమశివుడు' ఫొటోని చూపిస్తుంది. దాని ధర దాదాపు రూ. 25 లక్షల వరకు ఉండవచ్చని అంచనా. అంటే, పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘా నెలవారీ జీతం కంటే ఈ వాచ్ మూడు రెట్లు ఎక్కువ అని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. (PCబీ సెంట్రల్ కాంట్రాక్ట్ ప్రకారం, అఘాకు నెలకు సుమారు రూ. 7 లక్షల వేతనం వస్తుంది.) ఈ వాచ్ 'రుద్ర' మోడల్ లిమిటెడ్ ఎడిషన్‌గా జాకబ్ & కో ఎపిక్ స్పోర్ట్ సంస్థ తయారు చేస్తోంది.
Details
కొంతమందికే ఈ వాచ్ రిజర్వ్
ప్రపంచవ్యాప్తంగా కేవలం 25 పీస్‌లు మాత్రమే ఉన్న ఈ వాచ్, కంపెనీ కొంతమందికే రిజర్వ్ చేస్తుంది. స్కెలిటైన్ మూమెంట్‌తో రూపొందించిన ఈ వాచ్ చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ఇది 41 ఎంఎం గ్రేడ్ 5 టైటానియం కేస్‌తో తయారు చేశారు. 11.5 ఎంఎం మందంతో ఉండి 50 మీటర్ల వాటర్ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది. రోజువారీ స్పోర్ట్స్ కార్యకలాపాలకు ఉపయోగపడుతుంది. అలాగే దాదాపు 70 గంటల పవర్ రిజర్వ్ కలిగిన దీని పనితీరు ప్రత్యేకంగా ఉంటుంది.