LOADING...
Hardik Pandya: వన్డే సిరీస్‌కు హార్దిక్ పాండ్య దూరం.. భారత జట్టుకు మరో ఎదురుదెబ్బ
వన్డే సిరీస్‌కు హార్దిక్ పాండ్య దూరం.. భారత జట్టుకు మరో ఎదురుదెబ్బ

Hardik Pandya: వన్డే సిరీస్‌కు హార్దిక్ పాండ్య దూరం.. భారత జట్టుకు మరో ఎదురుదెబ్బ

వ్రాసిన వారు Moogati Shabari
Jun 10, 2026
01:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

మరో మూడు రోజుల్లో అఫ్గానిస్థాన్‌తో జరగనున్న వన్డే సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత క్రికెట్ జట్టుకు మరో కీలక ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ సిరీస్‌కు అందుబాటులో ఉండడంలేదని స్పష్టమైన విషయం తెలిసిందే. తాజాగా అతని తరహాలోనే ప్రముఖ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య కూడా సిరీస్ నుంచి తప్పుకున్నట్లు బీసీసీఐ వర్గాల సమాచారం. ఇటీవల హార్దిక్ పాండ్య ఫిట్‌నెస్‌పై సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ సానుకూల అభిప్రాయం వ్యక్తం చేసినప్పటికీ, ఆ నిర్ణయం వెలువడిన కొద్ది సమయంలోనే అతడు సిరీస్‌కు దూరమవుతున్నట్లు వార్తలు రావడం చర్చనీయాంశంగా మారింది.

వివరాలు

వెన్ను నొప్పికి కారణం అదే..

వెన్నునొప్పి కారణంగా ఐపీఎల్ సీజన్‌లో హార్దిక్ కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. టోర్నీ ముగిసిన అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి అతడు ఫిట్‌నెస్ పరీక్షల్లో పాల్గొన్నాడు. ఆ పరీక్షల్లో ఎలాంటి సమస్యలు లేవని భావించినప్పటికీ, ప్రస్తుతం తొడ కండరాల గాయం కారణంగా దాదాపు మూడు వారాల పాటు క్రికెట్‌కు దూరంగా ఉండాల్సి వస్తుందని సమాచారం. ఈ నేపథ్యంలో హార్దిక్ స్థానాన్ని భర్తీ చేయడానికి జట్టు యాజమాన్యం ఎవరిని ఎంపిక చేస్తుందనే అంశంపై ఆసక్తి నెలకొంది. మరోవైపు విరాట్ కోహ్లీ స్థానంలో యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌కు బీసీసీఐ అవకాశం కల్పించింది.

వివరాలు

అఫ్గానిస్థాన్‌తో వన్డే సిరీస్ షెడ్యూల్ ఇదే..

2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని భారత జట్టు తన సన్నాహాలను కొనసాగిస్తుండగా, ఆ టోర్నీకి ముందు కేవలం తొమ్మిది వన్డే మ్యాచ్‌లే ఆడనుంది. జూన్ 13 - తొలి వన్డే, ధర్మశాల జూన్ 17 - రెండో వన్డే, లక్నో జూన్ 20 - మూడో వన్డే, చెన్నై

Advertisement