LOADING...
Hardik Pandya: హార్దిక్ 'నో-లుక్' వికెట్‌తో సోషల్ మీడియా షేక్‌.. వీడియో వైరల్!
హార్దిక్ 'నో-లుక్' వికెట్‌తో సోషల్ మీడియా షేక్‌.. వీడియో వైరల్!

Hardik Pandya: హార్దిక్ 'నో-లుక్' వికెట్‌తో సోషల్ మీడియా షేక్‌.. వీడియో వైరల్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 16, 2026
02:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

కొలంబో వేదికగా జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత్‌ 61పరుగుల భారీ తేడాతో పాకిస్తాన్‌ను చిత్తుచేసింది. ఈ విజయానికి అసలైన టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది పవర్‌ప్లేలో భారత బౌలర్ల దూకుడు ప్రదర్శన. ప్రారంభ ఓవర్లలోనే పాక్‌ బ్యాటింగ్‌ను కుదేలు చేయడంతో మ్యాచ్‌ పూర్తిగా భారత్‌ వైపు మళ్లింది. ఈ క్రమంలో హర్ధిక్ పాండ్యా ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కొత్త బంతితో బౌలింగ్‌కు వచ్చిన పాండ్యా తొలి ఓవర్‌ను మేడిన్‌గా ముగించడమే కాకుండా పాకిస్తాన్‌ ఓపెనర్‌ సాహిబ్జాదా ఫర్హాన్‌ను ఔట్‌ చేశాడు. మొదటి ఓవర్‌లో నాలుగో బంతికి ఫర్హాన్‌ పుల్‌ షాట్‌ ఆడే ప్రయత్నం చేయగా బంతి గాల్లోకి లేచింది. ఆ క్యాచ్‌ను రింకు సింగ్ సురక్షితంగా అందుకున్నాడు.

Details

వికెట్ తీసిన ప్రశాంతంగా ఉన్న హర్దిక్ పాండ్యా

అయితే ఇక్కడే ఆసక్తికర ఘట్టం చోటుచేసుకుంది. క్యాచ్‌ పూర్తయ్యిందా లేదా అని వెనక్కి తిరిగి చూసే ప్రయత్నం కూడా చేయకుండా పాండ్యా నేరుగా ముందుకు నడుస్తూ, ఔటైన బ్యాటర్‌ను తదేకంగా చూస్తూ సాగిపోయాడు. రింకుసింగ్‌ క్యాచ్‌ను పూర్తి చేసిన వెంటనే ఇతర భారత ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయినా, పాండ్యా మాత్రం ఎలాంటి ఆర్భాటం లేకుండా ప్రశాంతంగా కనిపించాడు. ఈ 'నో-లుక్' వికెట్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు అతని రియాక్షన్‌ను "ఆరా ఫార్మింగ్" అంటూ ప్రశంసిస్తుండగా, మరికొందరు 'నో-లుక్ వికెట్' అంటూ వీడియోను విస్తృతంగా షేర్‌ చేస్తున్నారు. మొత్తంగా మ్యాచ్‌లో భారత్‌ సంపూర్ణ ఆధిపత్యం చాటగా, హార్దిక్‌ పాండ్యా 'నో-లుక్' వికెట్‌ క్షణం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచింది.

Details

"ఆరా ఫార్మింగ్" అంటూ ప్రశంస

అయితే ఇక్కడే ఆసక్తికర ఘట్టం చోటుచేసుకుంది. క్యాచ్‌ పూర్తయ్యిందా లేదా అని వెనక్కి తిరిగి చూసే ప్రయత్నం కూడా చేయకుండా పాండ్యా నేరుగా ముందుకు నడుస్తూ, ఔటైన బ్యాటర్‌ను తదేకంగా చూస్తూ సాగిపోయాడు. రింకు సింగ్‌ క్యాచ్‌ను పూర్తి చేసిన వెంటనే ఇతర భారత ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయినా, పాండ్యా మాత్రం ఎలాంటి ఆర్భాటం లేకుండా ప్రశాంతంగా కనిపించాడు. ఈ 'నో-లుక్' వికెట్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు అతని రియాక్షన్‌ను "ఆరా ఫార్మింగ్" అంటూ ప్రశంసిస్తుండగా, మరికొందరు 'నో-లుక్ వికెట్' అంటూ వీడియోను విస్తృతంగా షేర్‌ చేస్తున్నారు. మ్యాచ్‌లో భారత్‌ సంపూర్ణ ఆధిపత్యం చాటగా, హార్దిక్‌ పాండ్యా 'నో-లుక్' వికెట్‌ క్షణం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచింది.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో

Advertisement