ICC Mens T20 World Cup:షెపర్డ్‌కు హ్యాట్రిక్ వికెట్లు.. స్కాట్లాండ్‌పై వెస్టిండీస్ గెలుపు
ఈ వార్తాకథనం ఏంటి
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ 35 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్ బ్యాటింగ్‌లో తడబడింది. నిర్ణీత ఓవర్లు పూర్తికాకముందే 18.5 ఓవర్లలోనే 147 పరుగులకు ఆలౌటైంది. బెర్రింగ్‌టన్ 42 పరుగులు చేయగా, బ్రూస్ 35 పరుగులతో కొంత పోరాటం చేశాడు. అయితే మిగతా బ్యాటర్లు పూర్తిగా నిరాశపరిచారు. వెస్టిండీస్ బౌలర్లలో షెపర్డ్ హ్యాట్రిక్‌తో సహా మొత్తం 5 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు. హోల్డర్ 2 వికెట్లు తీసుకోగా, జోసెఫ్ మోటీ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
Details
సమిష్టిగా రాణించిన వెస్టిండీస్
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ సమష్టిగా రాణించింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. హెట్‌మయెర్ 64 పరుగులతో అర్ధశతకం సాధించి జట్టుకు కీలక ఆధారంగా నిలిచాడు. బ్రాండన్ కింగ్ 35, రూథర్‌ఫోర్డ్ 26, పావెల్ 24, హోప్ 19 పరుగులు చేశారు. చివర్లో షెపర్డ్ 6 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, మ్యాథ్యూ 1 పరుగుతో అతనికి తోడయ్యాడు. స్కాట్లాండ్ బౌలర్లలో బ్రాడ్ 2 వికెట్లు తీయగా, షరీఫ్, డేవిడ్సన్, లీస్క్ తలో వికెట్ సాధించారు.