ది వాల్ బ్యాటింగ్ సీక్రెట్ ఇదే.. మాజీ ప్లేయర్ వెల్లడి
టీమిండియా లెజెండరీ ప్లేయర్లలో రాహుల్ ద్రవిడ్ ఒకరు.. ఎన్నో మరుపురాని ఇన్నింగ్స్ ఆడి భారత్ జట్టుకు విజయాలను అందించాడు. క్రీజ్ లో పాతుకుపోయి రాహుల్ ద్రవిడ్ ది వాల్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. బౌలర్లు ద్రవిడ్ ను ఔట్ చేయాలంటే పెద్ద సాహసమే చేసేవాళ్లు..జనవరి 11, 2023నాటికి రాహుల్ ద్రవిడ్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం కోచ్ బాధ్యతలను నిర్వర్తిస్తున్న ద్రవిడ్ ఆటతీరుపై భారత్ మాజీ క్రికెటర్ బదానీ కీలక విషయాలను వెల్లడించారు. రాహుల్ ద్రవిడ్ చెన్నై క్రికెట్ లీగ్ ఆడేటప్పుడు గంటలకొద్దీ క్రీజులోనే గడిపేవాడు, అప్పట్లో చైన్నై లీగ్ కు ప్రత్యేక స్థానం ఉండేదని, అప్పట్లోనే సెంచరీల సెంచరీలను ద్రవిడ్ కొట్టేవాడని బదానీ చెప్పాడు.
సెంచరీలు కొట్టినా ఆలసిపోడు
రాహుల్ బెంగళూరులో ఉండేటప్పుడు లీగ్ కోసం చెన్నైకి వచ్చేవాడని, తాను లెఫ్టెడ్ షాట్లకు ప్రయత్నించి పెవిలియన్‌కు చేరేవాడిని, ద్రవిడ్ సెంచరీ కొట్టినా ఏ మాత్రం అలసిపోయినట్లు కనిపించేవాడు కాదని బదాని వెల్లడించారు. బంతిని ఎక్కువగా పైకి లేపకుండా పరుగులు రాబట్టేవాడు. సెంచరీలు కొట్టిన తరువాత నీకసలు నిరాశం రాదా అని ద్రవిడ్‌ను ప్రశ్నించా, దానికి ద్రవిడ్ చెప్పిన సమాధానం నాకు ఆశ్చర్యాన్ని గురి చేసింది. బెంగళూరు నుంచి చెన్నై వచ్చేందుకు రైలు ఎక్కుతానని, దాదాపు 6 ఆరు గంటలు ప్రయాణించి మరీ చైన్నై వస్తానని ద్రవిడ్ చెప్పాడు. కేవలం 3 గంటలు బ్యాటింగ్ చేయడానికి ఇన్నేసి గంటలపాటు ప్రయాణించానని, క్రీజులో ఎక్కువ సేపు గడపకపోతే ఫలితం ఏముంటుందని సమాధానం చెప్పినట్లు బదానీ వివరించారు.