Loading...
Hong Kong Sixes: హాంకాంగ్‌ సిక్సెస్‌ 2026.. పాకిస్థాన్‌ జట్టు ప్రకటన.. భారత్‌తో తొలి పోరు ఎప్పుడంటే!

Hong Kong Sixes: హాంకాంగ్‌ సిక్సెస్‌ 2026.. పాకిస్థాన్‌ జట్టు ప్రకటన.. భారత్‌తో తొలి పోరు ఎప్పుడంటే!

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 09, 2026
12:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

హాంకాంగ్‌ సిక్సెస్‌ 2026 టోర్నీకి పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) తమ జట్టును ప్రకటించింది. ఏడుగురు సభ్యులతో కూడిన జట్టుకు అనుభవజ్ఞుడైన బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అబ్బాస్‌ ఆఫ్రిదిని కెప్టెన్‌గా నియమించింది. ఈ టోర్నీలో భారత్‌, పాకిస్థాన్‌ జట్లు అక్టోబరు 30న తలపడనున్నాయి. హాంకాంగ్‌లోని మోంగ్‌ కాక్‌ వేదికగా అక్టోబరు 30 నుంచి నవంబరు 1 వరకు ఈ టోర్నీ జరగనుంది. మొత్తం 12 జట్లు నాలుగు గ్రూపులుగా విడిపోయి పోటీపడనున్నాయి.

వివరాలు 

నాలుగు గ్రూపులుగా జట్ల విభజన

గ్రూప్‌-ఎలో ఆస్ట్రేలియా, హాంకాంగ్‌-చైనా, ఇంగ్లండ్‌ జట్లు ఉన్నాయి.

గ్రూప్‌-బిలో శ్రీలంక, బంగ్లాదేశ్‌, స్కాట్లాండ్‌ పోటీపడనున్నాయి. గ్రూప్‌-సిలో భారత్‌, పాకిస్థాన్‌, యూఏఈ జట్లు తలపడనున్నాయి.

గ్రూప్‌-డిలో దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్‌, ఒమన్‌ జట్లు ఉన్నాయి. హాంకాంగ్‌ సిక్సెస్‌ టోర్నీలో ఒక్కో జట్టు ఆరు ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేస్తుంది.

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) గుర్తింపు ఉన్న ఈ టోర్నీలో పాల్గొనే దేశాలు తమ జట్లలో ప్రతిభావంతులైన ఆటగాళ్లకు అవకాశం కల్పిస్తాయి.

గత ఎడిషన్‌లో విజేతగా నిలిచిన పాకిస్థాన్‌ ఈసారి డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది.

వివరాలు 

భారత జట్టు కెప్టెన్‌గా భువనేశ్వర్‌ కుమార్

మరోవైపు, హాంకాంగ్‌ సిక్సెస్‌ 2026 టోర్నీకి భారత జట్టు సారథిగా అనుభవజ్ఞుడైన పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ను ఎంపిక చేశారు.

అయితే, టీమిండియాలోకి పునరాగమనం, న్యూజిలాండ్‌తో సిరీస్‌ నేపథ్యంలో భువనేశ్వర్‌ ఈ టోర్నీ నుంచి తప్పుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

గ్రూప్‌-సిలో భాగంగా భారత్‌, పాకిస్థాన్‌ జట్లు అక్టోబరు 30న తలపడనున్నాయి.

దీంతో ఈ మ్యాచ్‌పై క్రికెట్‌ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

గత టోర్నీలో టైటిల్‌ గెలిచిన పాకిస్థాన్‌ మరోసారి విజేతగా నిలవాలని భావిస్తుండగా, భారత జట్టు కూడా ఈ పోటీలో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది.

ADVERTISEMENT

వివరాలు 

హాంకాంగ్‌ సిక్సెస్‌-2026 టోర్నీకి పాకిస్తాన్‌ జట్టు

మహ్మద్‌ అబ్బాస్‌ ఆఫ్రిది (కెప్టెన్‌), అబ్దుల్‌ సమద్‌, అహ్మద్‌ దనియాల్‌, ముహమ్మద్‌ ఇర్ఫాన్‌ ఖాన్‌, ఖవాజా నఫే, ముహమ్మద్‌ షాజాద్‌, సాద్‌ మసూద్‌.

ADVERTISEMENT