Page Loader
4-2 తేడాతో వేల్స్‌పై భారత్ ఘన విజయం
వేల్స్ పై ఘన విజయం సాధించిన భారత్

4-2 తేడాతో వేల్స్‌పై భారత్ ఘన విజయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 20, 2023
11:39 am

ఈ వార్తాకథనం ఏంటి

కళింగ స్టేడియంలో గురువారం జరిగిన హాకీ ప్రపంచకప్ 2023 ఫైనల్స్ లో భారత పురుషుల జట్టు 4-2తో వేల్స్‌ను ఓడించింది. భారత్ తరఫున షంషేర్ సింగ్, ఆకాశ్‌దీప్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్స్ చేయగా, వేల్స్‌కు చెందిన ఫర్లాంగ్ గారెత్, డ్రేపర్ జాకబ్ గోల్స్ చేశారు. హర్మన్‌ప్రీత్ నేతృత్వంలోని జట్టు తమ క్రాస్ ఓవర్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. మరోవైపు ఇంగ్లండ్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. క్వార్టర్‌ఫైనల్‌కు నేరుగా అర్హత సాధించాలంటే ఎనిమిది గోల్స్‌ తేడాతో నెగ్గాల్సిన భారత్‌.. అంచనాలను అందుకోవడంలో విఫలమైంది.

హాకీ

నాలుగోసారి హాకీ ప్రపంచ కప్‌కు భారత్ అతిథ్యం

2-0 ఆధిక్యంలో ఉన్న భారత్‌ మూడు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్‌ చేసి వేల్స్‌ కు షాకిచ్చింది. వేల్స్‌ ఆటగాళ్లు రెండు గోల్స్‌ కొట్టడంతో అసలు భారత్‌ విజయం సాధిస్తుందా అన్న సందేహం కలిగింది. అయితే ఆఖరి క్వార్టర్‌లో ఆధిపత్యం చెలాయించిన భారత ఆటగాళ్లు జట్టుకు విజయాన్ని అందించారు. ఆకాశ్‌దీప్‌ తిరిగి ఆధిక్యంలో నిలిపితే.. మ్యాచ్‌ ముగియడానికి నిమిషం ముందు హర్మన్‌ప్రీత్‌ గోల్‌తో జట్టుకు నాలుగో గోల్‌ అందించాడు. 1982 (ముంబై), 2010 (ఢిల్లీ), 2018 (ఒడిశా) తర్వాత భారత్ నాలుగోసారి హాకీ ప్రపంచకప్‌ను నిర్వహిస్తోంది. ఒక దేశం టోర్నీకి ఆతిథ్యమివ్వడం ఇదే అధికసార్లు కావడం గమనార్హం. ముఖ్యంగా ఈ టోర్నీకి వరుసగా రెండుసార్లు ఆతిథ్యం ఇచ్చిన తొలి దేశంగా భారత్‌ నిలిచింది.