Arshdeep Singh: అభిషేక్ ఆరోగ్యం ఎలా ఉంది?.. క్లారిటీ ఇచ్చిన అర్ష్‌దీప్ సింగ్!
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా బ్యాటర్ అభిషేక్ వర్మ ఇటీవల ఉదర సంబంధ సమస్యతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. చికిత్స అనంతరం బుధవారం ఆయన డిశ్చార్జ్ అయినప్పటికీ, గురువారం నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో మాత్రం పాల్గొనలేదు. అభిషేక్ ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత ఇస్తూ భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ సోషల్ మీడియాలో ఒక వీడియోను పంచుకున్నాడు. ఆ వీడియోలో అభిషేక్ మాట్లాడుతూ తాను ప్రస్తుతం బాగానే ఉన్నానని తెలిపాడు. అయితే అనారోగ్య కారణంగా కొన్ని కిలోల బరువు తగ్గిపోయానని వెల్లడించాడు. ఇదిలా ఉండగా ఆదివారం కొలంబోలోని ఆర్. ప్రేమదాస్ స్టేడియం వేదికగా భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి.
Details
రెండు మ్యాచులకు దూరంగా ఉండే అవకాశం
ఈ కీలక మ్యాచ్‌లో అభిషేక్ ఆడుతాడా లేదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. నమీబియాతో జరిగిన మ్యాచ్ సందర్భంగా టాస్ సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ అంశంపై స్పందించాడు. అభిషేక్ శర్మ మరో ఒకటి లేదా రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నాడు. అయితే మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి భిన్నంగా స్పందించాడు. అభిషేక్ ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడని, ప్రాక్టీస్‌లో కూడా పాల్గొన్నాడని వెల్లడించాడు. పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో అతడు ఆడే అవకాశాలు ఉన్నాయని సూచించాడు.