Loading...
IPL 2027: సీఎస్కేకు భారీ షాక్.. ఒకేసారి మూడు జట్లకు స్టీఫన్ ఫ్లెమింగ్ రాజీనామా!
సీఎస్కేకు భారీ షాక్.. ఒకేసారి మూడు జట్లకు స్టీఫన్ ఫ్లెమింగ్ రాజీనామా!

IPL 2027: సీఎస్కేకు భారీ షాక్.. ఒకేసారి మూడు జట్లకు స్టీఫన్ ఫ్లెమింగ్ రాజీనామా!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 31, 2026
05:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

చైన్నై సూపర్ కింగ్స్ (CSK) హెడ్ కోచ్ పదవికి స్టీఫన్ ఫ్లెమింగ్ రాజీనామా చేశారు. అలాగే సీఎస్‌కేకు చెందిన ఇతర ఫ్రాంచైజీలైన సౌతాఫ్రికా టీ20 లీగ్ (SA20)లోని జోబర్గ్ సూపర్ కింగ్స్ (JSK), మేజర్ లీగ్ క్రికెట్ (MLC)లోని టెక్సాస్ సూపర్ కింగ్స్ హెడ్ కోచ్ బాధ్యతల నుంచి కూడా ఆయన తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో జోబర్గ్ సూపర్ కింగ్స్ తమ కొత్త హెడ్ కోచ్ పేరును అధికారికంగా ప్రకటించింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత భారీ సిక్సర్ బాదిన సౌతాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ అల్బీ మోర్కెల్‌ను జట్టు హెడ్ కోచ్‌గా నియమించింది.

వివరాలు

తొలి SA20 టైటిల్ లక్ష్యంగా మోర్కెల్

సూపర్ కింగ్స్ కుటుంబంతో సుదీర్ఘ అనుబంధం ఉన్న అల్బీ మోర్కెల్, జట్టుకు తొలి SA20 టైటిల్అం దించాలనే లక్ష్యంతో ఈ బాధ్యతలు చేపట్టనున్నారు.

నాలుగు సీజన్లుగా స్టీఫన్ ఫ్లెమింగ్ కోచ్‌గా వ్యవహరించగా, ఐపీఎల్‌లో ఆయన విజయవంతమైన ప్రస్థానం కొనసాగింది.

అయితే SA20లో జోబర్గ్ సూపర్ కింగ్స్ మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.

వివరాలు

125 మీటర్ల సిక్సర్‌తో గుర్తింపు

అల్బీ మోర్కెల్ 2008 ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతూ 125 మీటర్ల భారీ సిక్సర్ బాది చరిత్ర సృష్టించాడు.

ఆ షాట్ ఇప్పటికీ ఐపీఎల్‌లో అత్యంత భారీ సిక్సర్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం ఆయన కోచింగ్ రంగంలోకి అడుగుపెట్టారు.

సీఎస్‌కే ఫ్రాంచైజీల్లో గతంలో పలు కోచింగ్, సపోర్ట్ స్టాఫ్ బాధ్యతలు నిర్వహించినప్పటికీ, ఒక జట్టుకు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి.

అంతేకాదు, భారత్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్ సందర్భంగా దక్షిణాఫ్రికా జట్టు కోచింగ్ స్టాఫ్లో కూడా మోర్కెల్ కీలక సభ్యుడిగా పనిచేశారు.

ADVERTISEMENT

వివరాలు

మోర్కెల్‌పై పూర్తి నమ్మకం

100కు పైగా అంతర్జాతీయ మ్యాచ్‌ల అనుభవం ఉన్న అల్బీ మోర్కెల్‌పై జోబర్గ్ సూపర్ కింగ్స్ డైరెక్టర్ కాశీ విశ్వనాథన్ పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు.

ఆటగాడిగా, కోచ్‌గా సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ సంస్కృతిపై మోర్కెల్‌కు పూర్తి అవగాహన ఉందని, అలాగే దక్షిణాఫ్రికా క్రికెట్ పరిస్థితులపై ఆయనకున్న అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.

ADVERTISEMENT

వివరాలు

జనవరి 18న తొలి మ్యాచ్

SA20 తదుపరి సీజన్ 2027 జనవరి 17న ప్రారంభం కానుంది. జోబర్గ్ సూపర్ కింగ్స్ తమ తొలి మ్యాచ్‌ను జనవరి 18న పార్ల్ రాయల్స్‌తో ఆడనుంది.

ఐపీఎల్ ప్రారంభానికి ముందే హెడ్ కోచ్‌గా అల్బీ మోర్కెల్ తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సిన కీలక బాధ్యత ఇప్పుడు ఆయన భుజాలపై పడింది.

ADVERTISEMENT