LOADING...
Prince Yadav: కోహ్లీ చెప్పిందే చేశా.. వికెట్ దొరికింది: ప్రిన్స్ యాదవ్
కోహ్లీ చెప్పిందే చేశా.. వికెట్ దొరికింది: ప్రిన్స్ యాదవ్

Prince Yadav: కోహ్లీ చెప్పిందే చేశా.. వికెట్ దొరికింది: ప్రిన్స్ యాదవ్

వ్రాసిన వారు Jayachandra Akuri
May 08, 2026
09:03 am

ఈ వార్తాకథనం ఏంటి

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇచ్చిన సలహానే తనకు ఆయుధంగా మారిందని లక్నో సూపర్ జెయింట్స్ యువ పేసర్ పిన్స్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గురువారం ఏకనా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ కేవలం రెండు బంతులు మాత్రమే ఎదుర్కొని డకౌట్‌గా వెనుదిరగడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ కీలక వికెట్‌ను ప్రిన్స్ యాదవ్ దక్కించుకోవడం మ్యాచ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మ్యాచ్ ఆరంభంలోనే ప్రిన్స్ యాదవ్ తెలివైన బౌలింగ్‌తో కోహ్లీని ఇబ్బందికి గురిచేశాడు. మొదట అవుట్‌స్వింగర్‌తో పరీక్షించిన అతడు, వెంటనే గంటకు 140.4 కిలోమీటర్ల వేగంతో పదునైన ఇన్‌స్వింగర్‌ను సంధించాడు. బంతి లైన్‌ను అంచనా వేయడంలో విఫలమైన కోహ్లీ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.

వివరాలు

విరాట్ కోహ్లీ డకౌట్

రన్ ఛేజింగ్‌లో కోహ్లీ డకౌట్ కావడం గత తొమ్మిదేళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. చివరిసారిగా 2017లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌పై అతడు సున్నాకే ఔటయ్యాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన ప్రిన్స్ యాదవ్ కీలక విషయాన్ని వెల్లడించాడు. "గత మ్యాచ్ తర్వాత విరాట్ భయ్యా నాతో మాట్లాడారు. పిచ్‌పై బంతి సీమ్ అవుతున్నప్పుడు ఒకే లెంగ్త్‌లో బౌలింగ్ చేయాలని ఆయనే సలహా ఇచ్చారు" అని తెలిపాడు. కోహ్లీ ఇచ్చిన అదే సూచనను అతడిపై అమలు చేసి వికెట్ తీశానని పరోక్షంగా చెప్పాడు. ఈ మ్యాచ్‌లో ప్రిన్స్ యాదవ్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. కోహ్లీతో పాటు ఫడిక్కల్, జితేశ్ శర్మ వికెట్లను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.

వివరాలు

ఫ్లే ఆఫ్ ఆశలు సజీవం

నాలుగు ఓవర్లలో 33 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన ప్రిన్స్, 16 వికెట్లు తీసి లక్నో తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచాడు. ఈ విజయంతో లక్నో సూపర్‌జెయింట్స్ తమ ప్లేఆఫ్ ఆశలను ఇంకా సజీవంగా ఉంచుకుంది. వరుసగా ఆరు ఓటముల తర్వాత గెలుపు రుచి చూసిన లక్నో, ప్రస్తుతం 6 పాయింట్లతో పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. మే 10న చైన్నై సూపర్ కింగ్స్‌తో తమ తదుపరి మ్యాచ్ ఆడనుంది.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

విరాట్ కోహ్లీని ఔట్ చేసిన ప్రిన్స్ యాదవ్

Advertisement