మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం ఐసీసీ చరిత్రాత్మక నిర్ణయం
మహిళల టీ20 ప్రపంచకప్ కోసం ఐసీసీ చరిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఈ ఐసీసీ ఈవెంట్‌లో మహిళా అధికారులను నియమిస్తూ ప్రకటనను విడుదల చేసింది. ఎనిమిదో ఎడిషన్ ప్రతిష్టాత్మక పోటీలో 13 మంది మహిళా అధికారులు ప్రస్తుతం పనిచేయనున్నారు. ఐసీసీ అండర్-19 మహిళల T20 ప్రపంచకప్‌లో గతంలో కన్నా ఎక్కువ మంది మహిళా అధికారులు నియామకయ్యారు. ఫిబ్రవరి 10 నుంచి 26 వరకు దక్షిణాఫ్రికాలో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇండియా నుంచి ఎన్ జనని, బృందారాతి, జీఎస్ లక్ష్మి ఈ మ్యాచ్‌లకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించనున్నారు. అంపైర్లుగా ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ పెరీరా, నిమాలి పేరీరా ఉన్నారు.
ఐదుసార్లు టీ20 ప్రపంచకప్‌ని కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా
మహిళల టీ20 ప్రపంచ కప్ లో 10 జట్లు పాల్గొంటాయి. వాటిని రెండు గ్రూప్ లుగా విభజించారు. ఒక్క గ్రూప్ లోని జట్టు, మరో గ్రూప్ లోని జట్టుతో తలపడనుంది. ఒక్కో గ్రూపు నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 26న జరుగనుంది. గ్రూప్ ఏలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, గ్రూప్బిలో ఇంగ్లండ్, ఇండియా, వెస్టిండీస్, పాకిస్థాన్, ఐర్లాండ్ జట్లు ఉన్నాయి. ఇప్పటి వరకు జరిగిన ఏడు టీ20 ప్రపంచకప్‌లలో ఆస్ట్రేలియా ఐదింటిని కైవసం చేసుకుంది. ఇంగ్లండ్, వెస్టిండీస్ ఒకసారి విజయం సాధించాయి. 2020లో ఫైనల్ కు చేరిన ఇండియా.. ఆసీస్ చేతిలో 85 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే.