LOADING...
ICC Mens T20 World Cup: టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌కు ఐసీసీ రిఫరీల ప్రకటన
టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌కు ఐసీసీ రిఫరీల ప్రకటన

ICC Mens T20 World Cup: టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌కు ఐసీసీ రిఫరీల ప్రకటన

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 03, 2026
02:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌ మ్యాచ్‌లకు సంబంధించి మ్యాచ్‌ రెఫరీలు, అంపైర్ల వివరాలను ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. మార్చి 4, 5 తేదీల్లో కోల్‌కతా, ముంబయి వేదికగా జరగనున్న ఈ కీలక మ్యాచ్‌లకు జవగల్‌ శ్రీనాథ్‌, ఆండీ పైక్రాఫ్ట్‌లను మ్యాచ్‌ రెఫరీలుగా నియమించింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో దక్షిణాఫ్రికా-న్యూజిలాండ్‌ జట్లు తొలి సెమీఫైనల్‌లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు జవగల్‌ శ్రీనాథ్‌ రెఫరీగా బాధ్యతలు నిర్వహించనున్నారు.

Details

గురువారం రెండో సెమీ ఫైనల్ మ్యాచ్

ఆన్‌ఫీల్డ్ అంపైర్లుగా రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్‌, అలెక్స్ వార్ఫ్ వ్యవహరించనున్నారు. నితిన్‌ మీనన్‌ థర్డ్‌ అంపైర్‌గా, రాడ్‌ టక్కర్‌ నాలుగో అంపైర్‌గా నియమితులయ్యారు. మరోవైపు ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా గురువారం జరిగే రెండో సెమీఫైనల్‌లో టీమిండియా-ఇంగ్లండ్‌ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ఆండీ పైక్రాఫ్ట్‌ మ్యాచ్‌ రెఫరీగా వ్యవహరించనున్నారు. క్రిస్ గఫానీ, అల్లాహుద్దీన్ పాలేకర్ ఆన్‌ఫీల్డ్ అంపైర్లుగా ఉంటారు. ఆడ్రియన్ హోల్డ్‌స్టాక్‌ థర్డ్‌ అంపైర్‌గా, పాల్ రీఫెల్‌ ఫోర్త్‌ అంపైర్‌గా నియమితులయ్యారు.

Advertisement