Page Loader
Cricket: క్రికెట్‌లో కొత్త రూల్ చేర్చిన ఐసీసీ .. రేపటి నుంచే అమల్లోకి!
క్రికెట్‌లో కొత్త రూల్ చేర్చిన ఐసీసీ .. రేపటి నుంచే అమల్లోకి!

Cricket: క్రికెట్‌లో కొత్త రూల్ చేర్చిన ఐసీసీ .. రేపటి నుంచే అమల్లోకి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 11, 2023
05:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ దేశాలలో క్రికెట్‌కు రోజు రోజుకూ ఆదరణ పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఎన్నో దేశాలు అటు అంతర్జాతీయ క్రికెట్‌లో రాణించాలని ఎంతగానో ఆశపడుతున్నాయి. ఐసీసీ(ICC) కూడా కొత్త నిబంధనలతో క్రికెట్ ప్రాముఖ్యతను పెంచుతోంది. తాజాగా పరిమిత ఓవర్ల ఫార్మాట్లో వేగం పెంచేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ రేపటి నుంచి కొత్త నిబంధనను అమల్లోకి తీసుకుంది. విండీస్-ఇంగ్లండ్ జట్ల మధ్య రేపటి నుంచి ప్రారంభమయ్యే 5 మ్యాచుల టీ20 సిరీస్ నుంచి ఐసీసీ 'స్టాప్ క్లాక్' అనే నిబంధనను ఆచరణలో పెట్టనుంది. ఈ నిబంధన వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు అమల్లో ఉంటుందని ఐసీసీ ఇటీవలే వెల్లడించింది. మరోవైపు స్టాప్ క్లాక్ రూల్ పురుషుల వన్డే, టీ20 ఫార్మాట్లలో అమల్లో ఉంటుంది.

Details

నిబంధనను ఉల్లంఘిస్తే ఐదు పరుగుల పెనాల్టీ

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఓవర్ కు ఓవర్ కు ఆధిక సమయం వృథా అవుతోందని భావించిన ఐసీసీ, 60 సెకన్ల సమయాన్ని మాత్రమే గ్యాప్ టైమ్‌గా ఫిక్స్ చేసింది. ఒకవేళ రెండుసార్లు ఈ నిర్ధష్ట వ్యవధి దాటితే మూడోసారి బౌలింగ్ జట్టుకు ఐదు పరుగుల పెనాల్టీగా విధిస్తారు. ఈ పరుగులు బ్యాటింగ్ జట్టుకు యాడ్ అవుతాయి. స్టాప్ క్లాక్ సమయాన్ని ఫీల్డ్ అంపైర్లు నిర్ధారిస్తారు. నవంబర్ 21న అహ్మదాబాద్ లో జరిగిన బోర్డు సమావేశంలో స్టాప్ క్లాక్ నిబంధన అమలుపై ఐసీసీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.