వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ షెడ్యుల్ ను ప్రకటించిన ఐసీసీ
ఈ ఏడాది చివర్లో ఇండియాలో వన్డే వరల్డ్ కప్ జరగనుంది. ఈ వరల్డ్ కప్ కోసం క్వాలిఫయర్స్ షెడ్యూల్ ను మంగళవారం ఐసీసీ ప్రకటించింది. ఈ క్వాలిఫయర్స్ టోర్నీ జూన్ 18 నుంచి జులై 9 వరకూ జింబాబ్వే లోజరుగనుంది. ఇందులో పది జట్లు పోటీపడుతున్నాయి. వీటిని రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ స్టేజ్ లో మొత్తం 20 మ్యాచులు జరగనున్నాయి. ఆ తర్వాత సూపర్ 6 స్టేజ్ కు ఆరు జట్లు అర్హత సాధిస్తాయి. వీటిలో రెండు టీమ్స్ ఫైనల్ కు చేరనున్నాయి. ఈ ఫైనల్ కు క్వాలిఫై అయ్యే జట్లు వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొంటాయి.
వన్డే వరల్డ్ కప్ కి అర్హత సాధించిన ఎనిమిది జట్లు
గ్రూప్ ఎలో వెస్టిండీస్, జింబాబ్వే, నెదర్లాండ్స్, నేపాల్, యూఎస్ఏ.. గ్రూ బిలో శ్రీలంక, ఐర్లాండ్, స్కాట్లాండ్, ఒమన్, యూఏఈ ఉన్నాయి. తొలి క్వాలిఫయర్స్ మ్యాచ్ జూన్ 18న వెస్టిండీస్, యూఎస్ఏ మధ్య జరగనుంది. జూన్ 19న శ్రీలంక, యూఏఈ పోటీ పడనున్నాయి. ఇప్పటికే వన్డే వరల్డ్ కప్ కి ఇండియా, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు అర్హత సాధించాయి.