వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు వేదిక ఫిక్స్..!
ఈ వార్తాకథనం ఏంటి
వన్డే వరల్డ్ కప్ కోసం టీమిండియా ఫాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈసారి ఎలాగైనా టీమిండియా కప్పును కైవసం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. దీనిపై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా వన్డే వరల్డ్ కప్ గురించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది.
వన్డే ప్రపంచకప్ అక్టోబరులో నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేసిందట. నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్ ను నిర్వహించనున్నట్లు సమాచారం. ఇందుకు అహ్మదాబాద్ వేదిక కానుందట.
అక్టోబరు 5న ప్రారంభమై నవంబరు 19న జరిగే ఫైనల్‌తో ముగుస్తుందని సమాచారం. బీసీసీఐ ఈ టోర్నీ కోసం 12 వేదికలను కూడా షార్ట్ లిస్ట్ చేసిందట.
వన్డే వరల్డ్ కప్
వన్డే వరల్డ్ కప్‌లో 48 మ్యాచ్‌లు జరిగే అవకాశం
బెంగళూరు, చెన్నై, దిల్లీ, ధర్మశాల, గువహటి, హైదరాబాద్, కోల్‌కతా, లక్నో, ఇండోర్, రాజ్‌కోట్, ముంబయి వేదికల్లో వరల్డ్ కప్ మ్యాచ్‌లను నిర్వహించే అవకాశం ఉంది. 46 రోజుల పాటు జరిగే ఈ టోర్నిలో 10 జట్లు పాల్గొంటాయి. మొత్తం 48 మ్యాచ్ లు జరగనున్నాయి.
సాధారణంగా ప్రపంచ కప్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ముందుగానే ప్రకటించాలి. కానీ ఈసారి పాకిస్థాన్ క్రికెటర్ల వీసాల పరిస్థితి, భారత ప్రభుత్వం అందించే పన్ను మినహాయింపుల కోసం ఇంకా షెడ్యూల్ ను ప్రకటించకుండా వేచి ఉంది.
పాకిస్థాన్ క్రికెటర్లు 2013 నుంచి భారత పర్యటనకు రాలేదని, అయితే వారి వీసాలను భారత ప్రభుత్వం క్లియర్ చేసిందని బీసీసీఐ స్పష్టం చేసింది