
IND vs AUS: సిరీస్ డిసైడర్ మ్యాచ్‌లో గెలుపెవరిదో..!
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో టీమిండియా గెలుపొందింది. రెండో వన్డేలో ఆస్ట్రేలియా పది వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌ని 1-1తో సమం చేసింది. మూడో వన్డే మార్చి 22న చైన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది.
చెపాక్ స్టేడియంలో భారత్ ఇప్పటివరకూ 14 వన్డేలు ఆడగా.. ఏడు మ్యాచ్‌ల్లో గెలుపొందింది. 2019లో వెస్టిండీస్‌తో జరిగిన చివరి వన్డే మ్యాచ్‌లో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ వేదికపై గత ఐదు వన్డేల్లో భారత్ మూడింటిలో విజయం సాధించింది.
చెపాక్ ఇప్పటి వరకు 31 వన్డేలు జరిగాయి. మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 15 సార్లు గెలిచాయి.
విరాట్ కోహ్లీ
చెపాక్ పిచ్ కోహ్లీకి మెరుగైన రికార్డు
చెపాక్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండనుంది. చాలా గ్యాప్ తర్వాత ఈ గ్రౌండ్‌లో వన్డే మ్యాచ్ జరుగనుంది. ఇటువంటి పరిస్థితిలో మొదట టాస్ గెలిచిన జట్లు బౌలింగ్ ఎంచుకొనే అవకాశం ఉంటుంది. బ్యాటర్లకు ఈ పిచ్ అనుకూలంగా ఉండకపోవచ్చు.
భారత బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ వేదికపై ఏడు వన్డేలు ఆడి 40.42 సగటుతో 283 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు, ఒక సెంచరీ కూడా ఉంది
పాకిస్థాన్ తరఫున సయీద్ అన్వర్ ఈ పిచ్‌పై 1997లో అత్యధికంగా 194 పరుగులు చేశాడు. 2011లో రవి రాంపాల్ 5/51 తో రాణించాడు. రాహుల్ ద్రవిడ్, వినోద్ కాంబ్లీ 1997లో పాకిస్థాన్‌పై 134 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.