విరాట్ కోహ్లీని లెగ్ స్పిన్నర్ అడమ్ జంపా ఔట్ చేస్తాడా..?
ప్రపంచ క్రికెట్‌లో టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీకి ప్రత్యేక స్థానముంది. కోహ్లీ దేశం సంబంధం లేకుండా అభిమానులను సంపాదించుకున్నాడు. ఎన్నో మైలురాళ్లను ఒకటోకటిగా బద్దలుకొడుతూ రికార్డులను సృష్టించాడు. ప్రస్తుతం నేటి నుంచి ఆస్ట్రేలియాతో టీమిండియా వన్డే సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్ లో కోహ్లీపై ప్రస్తుతం అంచనాలు భారీగా పెరిగిపోయాడు. అతను వన్డేల్లో సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ అడమ్ జంపాను కోహ్లీని ఏ విధంగా ఎదుర్కొంటాడో వేచి చూడాలి ఆసీస్‌పై కోహ్లీ మెరుగైన రికార్డును కలిగి ఉన్నాడు. జంపా కొంతకాలంగా ఆస్ట్రేలియా తరుపున మెరుగ్గా రాణిస్తున్నాడు. కోహ్లీ వికెట్‌ను తీయడంలో జంపా మంచి దిట్ట.
లెగ్ స్పిన్నర్లను కోహ్లీ ఎదుర్కొంటాడా..?
జంపా ఇప్పటి వరకు 11 వన్డేల్లో కోహ్లిని ఐదుసార్లు అవుట్ చేశాడు. బంగ్లాదేశ్‌కు చెందిన షకీబ్ అల్ హసన్ మాత్రమే వన్డేలలో ఎక్కువసార్లు కోహ్లీ వికెట్ ను తీసిన రికార్డు ఉంది. అదే విధంగా కోహ్లీ జంపా వేసిన 193 బంతుల్లో 214 పరుగులు చేశాడు. కోహ్లీ లెగ్ స్పినర్లను ఆడటానికి ఇష్టపడతాడు.అయితే 77 ఇన్నింగ్స్ లో కోహ్లీ 18 సార్లు లెగ్ స్పినర్ల బౌలింగ్ లో ఔటయ్యాడు. కోహ్లీ ఆస్ట్రేలియాపై 43 వన్డేలు ఆడి 2,083 పరుగులు చేశాడు. ఇందులో ఎనిమిది సెంచరీలు సాధించాడు. సచిన్ టెండూల్కర్ 9 సెంచరీలు చేసి రెండో స్థానంలో ఉన్నాడు. స్వదేశంలో కోహ్లీ ఆస్ట్రేలియాతో 23 వన్డేల్లో 1,199 పరుగులు చేశాడు.