ఆస్ట్రేలియాతో చివరి వన్డే.. జట్టులో కీలక మార్పు..!
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. మూడో వన్డేలో గెలిచిన జట్టునే సిరీస్ వరించనుండటంతో ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి.
విశాఖలో జరిగిన వన్డేలో 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన టీమిండియా.. ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. రెండో వన్డే గెలుపుతో జోష్ మీద ఉన్న ఆసీసీ.. అదే ఉత్సాహంతో సిరీస్ ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. దీంతో చెన్నై వేదికగా జరిగే మూడో వన్డే ఉత్కంఠంగా మారనుంది.
ఇక సిరీస్ డిసైడ్ చేసే మూడో వన్డేలో టీమిండియా ఒక మార్పుతో బరిలోకి దిగే అవకాశం ఉంది. వెటరన్ స్పిన్నర్ కుల్దీప్ స్థానంలో ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ కు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
టీమిండియా
చివరి వన్డేలో వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం..?
చెపాక్ స్టేడియం పిచ్ స్పిన్ కు అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో లోకల్ బాయ్ వాషింగ్టన్ సుందర్ ను తుది జట్టులోకి తీసుకొనే అవకాశం ఉంది.
చెపాక్ పిచ్ స్నినర్లకు అనుకూలంగా ఉండనుంది. ఈ పిచ్ లో బ్యాటర్లకు పరుగులు తీయడం చాలా కష్టంగా ఉంటుంది. రాత్రి మ్యాచ్‌లో మంచు కురిసే అవకాశం ఉండడం వల్ల టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది.
భారత్ తుది జట్టు(అంచనా) రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ షమీ