వన్డేల్లో ఆస్ట్రేలియాపై రోహిత్‌కు మెరుగైన రికార్డు
ఇండియా, ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ ఈనెల 17న ప్రారంభం కాబోతోంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో తొలి వన్డే జరగనుంది. మొదటి వన్డేకి రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరమవ్వగా..రెండు, మూడు వన్డేలకి అందుబాటులో ఉండనున్నాడు. దీంతో మొదటి వన్డేకి కెప్టెన్ హార్ధిక్ పాండ్యా వ్యవహరించనున్నాడు. అయితే వన్డేల్లో ఆస్ట్రేలియాపై రోహిత్‌కు మెరుగైన రికార్డు ఉంది. కేవలం ఆస్ట్రేలియాపై 61.33 సగటుతో చెలరేగాడు. వన్డేల్లో ఆస్ట్రేలియాపై అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. ఆస్ట్రేలియా సచిన్ టెండుల్కర్ 3077 పరుగులు చేసి మొదటి స్థానంలో ఉన్నాడు. డెస్మండ్ హేన్స్ 2262 పరుగులు, రోహిత్ శర్మ 2208 పరుగులు చేశాడు.
రోహిత్ శర్మ వన్డేల్లో సాధించిన ఘనతలు ఇవే
ఆస్ట్రేలియాపై వన్డేల్లో 9 సెంచరీలు చేసి సచిన్ మొదటి స్థానంలో ఉండగా.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 8 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియాపై డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా రోహిత్ కు పేరుంది. వన్డేల్లో ఆసీస్ పై భారత్ 19 విజయాలను సాధిస్తే అందులో రోహిత్ 1206 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, ఐదు అర్ధ సెంచరీలు, ఓ డబుల్ సెంచరీ ఉంది. 24 వన్డేలకు రోహిత్ కెప్టెన్‌గా వ్యవహరించి 1,120 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, ఏడు అర్ధసెంచరీలు ఉన్నాయి. వన్డేలో 10వేల పరుగులు పూర్తి చేయడానికి రోహిత్ శర్మ 218 పరుగుల దూరంలో ఉండడం విశేషం.